Big Stories

IND vs SA T20 WC 2024 Final Match: ఒరేయ్! మనోళ్లు కొడతారంటావా?.. నెట్టింట అభిమానుల ఆందోళన

Cricket fans ‘hopeful that Team India will win T20 WC 2024 Final Match after beating SA: టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ పై భారతదేశంలో మళ్లీ పూనకాలు మొదలయ్యాయి. నాడు 2023 వన్డే ఫైనల్ మ్యాచ్ ను తలపించేలా నెట్టింట క్రికెట్ వైరల్ ఫీవర్ మొదలైంది. అందరినోటా ఇదే మాట..

- Advertisement -

ఒరేయ్.. మళ్లీ మనవాళ్లు కొడతారంటావా?
ఎందుకంటే మొన్న ఓడిపోయారు కదరా..
ఒక్కడు ఆడితే చాలురా..
కొహ్లీ టచ్ లోకి వచ్చేస్తే.. ఇహ చూస్కో అక్కర్లేదు
బుడ్డోడు పంత్ ఇప్పుడు ఆడాలి రా..
బౌలింగు సూపరెహే.. మనోళ్లకి తిరుగులేదు..

- Advertisement -

ఇదే గొడవ.. ఎక్కడ చూసినా ఇదే గోల.. ఎవరికి వాళ్లు తమకి తోచిన రీతిలో విశ్లేషణలు చేస్తున్నారు. మహామహా కాకలు తీరిన సీనియర్ క్రికెటర్లు కూడా వీళ్ల ముందు బలాదూరే అన్నట్టుంది. ఒకొక్కసారి వాళ్లు కూడా మరిచిపోయిన గణాంకాలను వీళ్లు గుర్తుచేస్తున్నారు. మొత్తానికి టీమ్ ఇండియా ఫైనల్ మ్యాచ్ పై పూనకాలు లోడింగ్ అయ్యాయి.

కరీబియన్ గడ్డపై భారత జెండా రెపరెపలు ఎగరక తప్పదని అంటున్నారు. విశ్వవిజేతగా మారేందుకు ఇండియా ఇక ఒక్క అడుగు దూరంలో మాత్రమే ఉంది. బలమైన సౌతాఫ్రికాను ఢీకొట్టి 13 ఏళ్ల నిరీక్షణకు తెర దించాలని భారతీయులు ప్రతీ ఒక్కరూ కోరుతున్నారు.

2007లోనే టీ20 వరల్డ్ కప్ ను మనం సాధించినా.. 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ మరో వరల్డ్ కప్ ను అందుకోలేక పోయింది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ వరకూ దూసుకెళ్లినా ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయి ఆసీస్ కు ట్రోఫీని అప్పగించింది.  ఈసారి అలాంటి పొరపాటు మళ్లీ చేయమని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ ద్రవిడ్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

వరుస విజయాలతో సౌతాఫ్రికా దూసుకువచ్చిన మునుపటంత బలంగా లేదు. మొన్నటి వరకు డికాక్ మాత్రమే ఆడాడు.  క్లాసెన్ లాంటి  హిట్టర్ కి టచ్ దొరకడం లేదు. మన కొహ్లీలాగే అతని పరిస్థితి ఉంది.
కాకపోతే ఇండియాపై బ్రహ్మాండంగా ఆడే మిల్లర్ రెచ్చిపోతే మాత్రం ప్రమాదమే అంటున్నారు.

Also Read: ఫైనల్ మ్యాచ్ కి వరుణుడి ఆటంకం?

ఒత్తిడిలో ఓడిపోవడం సౌతాఫ్రికాకి ఉన్న ప్రధాన బలహీనత. తొలిసారి టీ 20 ప్రపంచకప్ లో ఫైనల్ వరకు వచ్చింది. అందుకని కచ్చితంగా ఆ జట్టుపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. మనవాళ్ల విషయానికి వస్తే వీళ్లకి అంత ఉండదు. ఎందుకంటే ఎప్పుడూ ఫైనల్ వరకు వచ్చి ఓడిపోతుంటారు కాబట్టి, ఈజీగానే ఆడేస్తారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

అయితే ఒక్క మ్యాచ్ లో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తే చాలు.. ప్రపంచకప్ భారత్ చేతిలోకి వచ్చేస్తుంది. టీమిండియా విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు అప్పుడే పూజలు, దేవాలయ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు. వంద కొబ్బరి కాయలు కొడతామనే మొక్కులైతే సర్వ సాధారణమైపోయాయి. మరి 140 కోట్ల మంది భారతీయుల పూజలు ఫలిస్తాయో లేదో చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News