Big Stories

Chinese badminton player dies: బ్యాడ్మింటన్‌ టోర్నీలో విషాదం.. ఆడుతూ కోర్టులో.. చైనా ఆటగాడు మృతి

Chinese badminton player death news(Today’s sports news): ఈ మధ్యకాలంలో అరుదుగా వచ్చే వ్యాధుల్లో గుండెపోటు ఒకటి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఎప్పుడు, ఏ సమయంలో ఎవరికి వస్తుందో తెలీదు. దీని బారినపడి చాలా మంది చనిపోయిన ఘటనలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. తాజాగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నీలో అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. స్పాట్‌లో చైనా ఆటగాడు మృతి చెందాడు.

- Advertisement -

ఇండోనేషియా వేదికగా ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ జరుగుతోంది. పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకారం మ్యాచ్ జరుగుతోంది. చైనా-జపాన్ క్రీడాకారులు నువ్వేనేనా అన్నరీతిలో తలపడ్డారు. 17 ఏళ్ల చైనా ఆటగాడు జాంగ్ జిజీ- జపాన్ ప్లేయర్ కజుమాతో ఆడుతున్నారు.

- Advertisement -

తొలి గేమ్‌లో ఇద్దరి స్కోర్ 11-11 వద్దకు చేరింది. ఈ క్రమంలో చైనా ఆటగాడు జాంగ్ అస్వస్థత కారణంగా కాసేపు నిలబడ్డాడు. రెండు అడుగులు ముందుకేశాడు. వెంటనే కుప్పకూలిపోయింది. ఫస్ట్ ఎయిడ్ చికిత్స అందించి, అంబులెన్స్‌లో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే జాంగ్ చనిపోయాడని డాక్టర్లు చెప్పడంతో టోర్నీ ఆర్గనైజర్స్ షాకయ్యారు. తోటి ఆటగాళ్లు విషాదంలో ముగినిపోయారు.

ALSO READ: టీ 20 వరల్డ్ కప్ ఐసీసీ అవార్డుల లిస్ట్ ఇదే..

ఈ ఘటనపై భారత స్టార్ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో నా హృదయం ముక్క లైందని తెలిపింది. ఈ సమయంలో జాంగ్ ఫ్యామిలీకి సానుభూతి వ్యక్తం చేసింది. అద్బుతమైన ఆడగాడ్ని ప్రపంచం కోల్పోయిందని సోషల్ మీడియాలో ప్రస్తావించిందామె.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News