Big Stories

Canada beats Ireland by 12 Runs: కెనడా గెలుపు.. పోరాడి ఓడిన ఐర్లాండ్..!

Canada beats Ireland by 12 Runs in  T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో మరో రెండు చిన్న జట్లు కెనడా వర్సెస్ ఐర్లాండ్ మధ్య న్యూయార్క్ లో మ్యాచ్ జరిగింది. తక్కువ స్కోరు చేసినా రెండు జట్లు పోరాట పటిమ చూపించాయి. ఈ పోరులో కెనడా విజయం సాధించింది.

- Advertisement -

టాస్ గెలిచిన ఐర్లాండ్ బౌలింగు తీసుకుంది. దీంతో మొదట కెనడా బ్యాటింగ్ కి వచ్చింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఐర్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 12 పరుగుల తేడాతో కెనడా విజయం సాధించింది.

- Advertisement -

126 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ కి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (9) త్వరగా అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ (17) కొంచెం ఫర్వాలేదనిపించాడు. కానీ తర్వాత వచ్చిన టక్కర్ (10), హ్యారీ టెక్టర్ (7), క్యాంప్ ఫెర్ (4) ఇలా వెంటవెంటనే అయిపోయారు.
ఒక దశలో 12.3 ఓవర్లలో 59 పరుగులకి 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

ఏ దశలోనూ ఐర్లాండ్ గెలుస్తుందని ఎవరూ అనుకోలేదు. కానీ అప్పుడొచ్చాడు జార్జ్ డాక్రెల్.. 23 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తనకి మార్క్ అడైర్ సహకారం అందించాడు. తను 24 బంతుల్లో 1 సిక్సర్, 3 ఫోర్ల సాయంతో 34 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

Also Read: కొంప ముంచిన పాకిస్తాన్ ఫీల్డింగ్

చివరికి 6 బంతుల్లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే ఒక వికెట్ కోల్పోయి, 5 పరుగులు మాత్రమే చేసింది. అలా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 12 పరుగుల తేడాతో ఐర్లాండ్ పరాజయం పాలైంది.

కెనడా బౌలింగులో జెర్మీ గోర్డన్ 2, సిద్దిఖి 1, జాఫర్ 1, దిల్లాన్ 2 వికెట్లు పడగొట్టారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన కెనడా కి కూడా ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేదు. ఆరోన్ జాన్సన్ (14),  నవనీత్ (6) వెంటనే అయిపోయారు. ఫస్ట్ డౌన్ వచ్చిన పర్గత్ సింగ్ (18), దిలప్రీత్ భజ్వా(7) ఇద్దరూ పెద్దగా ఆకట్టుకోలేదు.

Also Read: WI vs UGA HighlightsT20 World Cup 2024: మరో అత్యల్ప స్కోరు నమోదు.. ఉగండా 39కి ఆలౌట్ .. వెస్టిండీస్ ఘన విజయం

ఆ సమయంలో వచ్చిన నికోలస్ కిరణ్ 35 బంతుల్లో 2 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 49 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తనకి శ్రేయాస్ మొవ్వ (37) సహకారం అందించాడు. తర్వాత వచ్చిన దిల్లాన్ డక్ అవుట్ అయ్యాడు. మొత్తానికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

ఐర్లాండ్ బౌలింగులో మార్క్ అడైర్ 1, క్రెయిగ్ యంగ్ 2, బారీ మెక్ కార్తీ 2, గారెత్ డెలానీ 1 వికెట్ పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News