Big Stories

Axar Patel: మనవాళ్లు చెప్పినట్టు బాల్స్ వేశా: అక్షర్ పటేల్

Axar Patel in Post Match Presentation: భారత విజయంలో కీలకపాత్రధారి ఎవరంటే అక్షరపటేల్ అని చెప్పాలి. టీ 20 ప్రపంచకప్ సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ ఓపెనర్లు ప్రమాదకరంగా మారుతున్న దశ అది. అర్షదీప్ 2, బుమ్రా 1 ఓవర్ వేశారు. వికెట్ రాలేదు. మరోవైపు నుంచి జోస్ బట్లర్ దంచి కొడుతున్నాడు. అప్పటికే 15 బంతుల్లో 23 పరుగులు చేసి, మంచి ఊపు మీదున్నాడు.

- Advertisement -

ఈ సమయంలో రోహిత్ శర్మ బాల్ ని అక్షర్ పటేల్ కి అందించాడు. అంతే తన మొదటి బంతికి ప్రమాదకరమైన జోస్ బట్లర్ ని వెనక్కి పంపించాడు. అలా వేసిన మూడు ఓవర్లలో 3 కీలకమైన వికెట్లు తీశాడు. చాలా డేంజరస్ బ్యాటర్లు అయిన ఇంగ్లండ్ టాపార్డర్ లో జోస్ బట్లర్, మెయిన్ ఆలీ, బెయిర్ స్టోలను అవుట్ చేసి ఇండియాకి బ్రేక్ అందించాడు. దీంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

- Advertisement -

ఈ సందర్భంగా అక్షర్ పటేల్ మాట్లాడుతూ టీమ్ లో సీనియర్లు చెప్పినట్టు నడుచుకున్నానని తెలిపాడు. వాళ్లు చెప్పారు. పిచ్ స్లోగా ఉంది. నెమ్మదిగా బౌల్ చేయమని అన్నారు. ఆ ప్రకారమే వేయడానికి ప్రయత్నించానని అన్నాడు. ఆ ట్రిక్ పనిచేసిందని తెలిపాడు. పిచ్ పరిస్థితికి తగినట్టుగా బౌలింగ్ చేసినట్టు వివరించాడు.

చాలా సందర్భాల్లో పవర్ ప్లేలో బౌలింగ్ చేసిన అనుభవం ఉందని అన్నాడు. అయితే రోహిత్ శర్మ నాపై నమ్మకం ఉంచడంతో మరింత బాధ్యతగా ఫీలయ్యానని అన్నాడు. కెప్టెన్ ప్రణాళికల ప్రకారం బౌలింగు చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నాడు. ఈ పిచ్ మీద 160 ప్లస్ స్కోరు ఛేదించడం సవాల్ అని అన్నాడు. కానీ 171 పరుగుల టార్గెట్ ఇవ్వడంతో బౌలర్లపై ఒత్తిడి తగ్గి, స్వేచ్ఛగా బౌలింగ్ చేశామని అన్నాడు.

Also Read: ‘గుడ్ నైట్ బామ్మర్దులూ’.. ఇంగ్లాండ్ ఆటగాళ్లపై యువరాజ్ సెటైరికల్ పోస్ట్..

లేదంటే ఒక ఫోర్ వెళ్లినా, ఒక సిక్స్ వెళ్లినా బౌలర్లపై అంతర్లీనంగా ఒత్తిడి ఉంటుందని, అది లేకపోవడంతో మనం అనుకున్నది అనుకున్నట్టు వేశామని అన్నాడు. ఇంతదూరం ప్రయాణించడం గర్వంగా ఉందని అన్నాడు. అయితే రేపటి ఫైనల్ గురించి ఇప్పటి నుంచి ఆందోళన చెందడం లేదని, ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ లో లభించిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎంజాయ్ చేస్తున్నానని అన్నాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News