Big Stories

Hardik Pandya: నాడు విమర్శలు.. నేడు జేజేలు

Hardik chants In Wankhede after T20 World Cup 2024: ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అనే సామెత తెలుగునాట చాలా ఫేమస్. ఇదే సామెత ఇప్పుడు హార్థిక్ పాండ్యాకు వర్తిస్తోందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఐపీఎల్‌లో విమర్శించిన నోళ్లే ఇప్పుడు హార్ధిక్, హార్ధిక్ అంటూ నీరాజనాలు పలుకుతున్నాయి. అంటే సమయం ఎంత తొందరాగా మారుంతుందో అర్ధం చేసుకోవచ్చు.

- Advertisement -

జూలై 4, గురువారం నాడు ముంబైలో జరిగే టీమ్ ఇండియా విజయోత్సవ పరేడ్‌కు ముందు ముంబైలోని వాంఖడే స్టేడియం ‘హార్దిక్, హార్దిక్’ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. హార్థిక్ పాండ్యా విమోచన కథలో ఇది నూతనోధ్యాయం. కొన్ని నెలల క్రితం ఐపీఎల్ సందర్భంగా అదే వాంఖడే స్టేడియంలో హార్ధిక్‌ను తీవ్రస్థాయిలో విమర్శించారు. ఐదు సార్లు ముంబై ఇండియన్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపిన రోహిత్ శర్మను కాదని పాండ్యాకు కెప్టెన్సీ కట్టబెట్టడంతో జీర్ణించుకోని ముంబై అభిమానులు సీజన్ ఆసాంతం పాండ్యాపై విమర్శల వర్షం కురిపించారు. దానికి తోడు 2024 ఐపీఎల్ సీజన్‌లో ముంబై 14 మ్యాచుల్లో కేవలం 4 మాత్రమే గెలవడంతో విమర్శలు ఇంకా ఎక్కువయ్యాయి. అయినా పాండ్యా వెన్నక్కుతగ్గలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగాడు.

- Advertisement -

టీమ్ ఇండియా టీ20 ప్రపంచ కప్ సాధించడంలో హార్థిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ప్రపంచ కప్‌లో పాండ్యా 11 వికెట్లు తీయడంతో పాటు 48 సగటుతో 144 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో జోర్డాన్ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాది మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇక ఫైనల్లో సఫారీలకు 24 బంతుల్లో 24 పరుగులు అవసరమున్నప్పుడు భీకర ఫామ్‌లో ఉన్న క్లాసెన్ వికెట్ తీసి టీమ్ ఇండియా విజయానికి పునాది వేశాడు. ఇక చివరి ఓవర్లో 16 పరుగులను డిఫెండ్ చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ప్రపంచ కప్ ఫైనల్ గెలిచాక పాండ్యా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ తరువాత మాట్లాడుతూ గత ఆరు నెలు ఎలా ఉన్నాయో తనకి మాత్రమే తెలుసని.. ఈ విజయం తనకెంతో ప్రత్యేకమని అన్నాడు.

Also Read: ఐసీసీ టీ20 ర్యాకింగ్స్.. అగ్రస్థానానికి పాండ్యా..

నాడు విమర్శించిన నోళ్ళే నేడు నేడు హార్థిక్, హార్థిక్ అనడం మామూలు విషయం కాదు. పాండ్యా జీవితంలో ఇదొక కలికీతురాయి అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News