Big Stories

Team India: సూపర్ 8.. టీమ్ ఇండియాకు కఠిన సవాళ్లెన్నో!

Biggest Challenges Facing Indian Cricket Team in T20 World Cup 2024 Super 8: టీ 20 ప్రపంచకప్ లో నిజాయితీగా చెప్పాలంటే.. ఒకింత అదృష్టం తోడయ్యి సూపర్ 8కి భారత్ చేరిందనే చెప్పాలి. ఈ మాటంటే చాలామంది ఒప్పుకోరు. ఎందుకంటే మంచి జోష్ మీదున్నారు. వీరందరూ ఒకటి గుర్తుంచుకోవాలి. పాకిస్తాన్ తో జరిగిన ‘లో స్కోరు’ మ్యాచ్ లో బుమ్రాకి బాల్ స్వింగ్ అయి ఉండకపోతే మన పరిస్థితి ఏమిటి? అమెరికాతో జరిగిన మ్యాచ్ లో ఇటు సూర్యకుమార్ ఆడకపోతే మన గతి ఏమిటి? ఇవి నిజాలు, కఠిన వాస్తవాలు.. వీటిని మరిచిపోవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు.

- Advertisement -

ప్రాక్టీసు వదిలేసి బార్బడోస్ బీచ్ లో వాలీబాల్ ఆడినట్టు లైట్ గా తీసుకుని, సూపర్ 8 మ్యాచ్ లు ఆడితే కుదరదని సీనియర్లు కామెంట్ చేస్తున్నారు. లెఫ్ట్ నుంచి ఆఫ్గనిస్తాన్, రైట్ నుంచి బంగ్లాదేశ్, స్ట్రయిట్ నుంచి ఆస్ట్రేలియా అన్నీ కలిపి  టీమ్ ఇండియాపై దాడి చేయనున్నాయి.

- Advertisement -

ఇందులో ఏ ఒక్కదాంట్లో ఓడిపోయినా నెట్ రన్ రేట్ చివరికి ఆధారం అవుతుంది. ఈలోపు వర్షం వచ్చిందంటే, అవతలి జట్టుకి ప్లస్ అవుతుంది. మనకి మాత్రం పాకిస్తాన్ గతే పడుతుంది. అందుకని మూడుకి మూడు మ్యాచ్ లు గెలవాల్సిందేనని అంటున్నారు.

అయితే లక్కీగా మొదటే ఆఫ్గాన్, బంగ్లాతో మ్యాచ్ లున్నాయి. వీటిని సమర్థవంతంగా ఆడి గెలిస్తే, చివర్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ ని ఆచితూచి ఆడవచ్చునని అంటున్నారు. ఎందుకైనా మంచిది, ఈ రెండు మ్యాచ్ లపై కూడా మంచి నెట్ రన్ రేట్ తో గెలవాలని కూడా  చెబుతున్నారు. ఒకవేళ ఆస్ట్రేలియాతో ఓడిపోయినా నెట్ రన్ రేట్ కీలకం అవుతుందని నెట్టింట సలహాలిస్తున్నారు.

ఆఫ్గనిస్తాన్ ని తక్కువ అంచనావేయడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడెలా ఆడుతుందో ఆ జట్టుకే తెలీదు. చావడానికైనా సిద్ధం అంటూ మొండిగా యుద్ధం చేసేవాడితో గెలవలేమని అంటున్నారు. న్యూజిలాండ్ ని ఓడించి సూపర్ 8కి వచ్చిందంటే, ఆ జట్టుతో టీమ్ ఇండియా అప్రమత్తంగా ఉండాల్సిందేనని సీనియర్లు అంటున్నారు.

Also Read: సూపర్ 8.. టీ20 ప్రపంచ కప్ 2024 మ్యాచ్ వేళలు ఇవే..

బంగ్లాదేశ్ కూడా తక్కువేం కాదు.. తమదైన రోజున వారిని ఎదిరించి బరిలో నిలువలేమని అంటున్నారు. పెద్దజట్లను తలదన్ని సూపర్ 8కి వచ్చిందంటే, టీమ్ ఇండియాకి అంత ఈజీయేం కాదని అంటున్నారు.

ఇక అసలైన సవాల్ ఆస్ట్రేలియాతో ఉంది. ఇక్కడే టీమ్ ఇండియా కప్ సాధిస్తుందా? లేదా? అనేది తేలిపోతుంది. నిజానికి ఇది సూపర్ 8 మ్యాచ్ కాదు.. ప్రి క్వార్టర్ ఫైనల్ అని చెప్పాలి. అయితే మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడి, టాప్ 2లో ఉండటం పెద్ద కష్టం కూడా కాదని అంటున్నారు. మరి చక్కగా బార్బడోస్ బీచ్ లో ఫుట్ బాల్ ఆడుతూ చిల్ అవుతున్న మనవాళ్లు చివరికేం చేస్తారో చూడాల్సిందే మరి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News