Big Stories

Gautam Gambhir: గౌతం గంభీర్ టీమ్ ఇండియా కోచ్.. ఇది ఫిక్స్ !

- Advertisement -

అది 2011 ప్రపంచం వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ..

టీమ్ ఇండియా టార్గెట్ 275 పరుగులు.. 50 ఓవర్లు.. శ్రీలంక ప్రత్యర్థి..
మన డేరింగ్ అండ్ డేషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డక్ అవుట్
మన క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ 18 పరుగులు
మన కింగ్ కొహ్లీ.. 35 పరుగులు..
అందరూ అలా పడిపోతున్నా అటు వైపు ఒక ఓపెనర్ మొక్కవోని ధైర్యంతో, మొండిగా వికెట్ల ముందు అటుఇటూ పరుగెడుతున్నాడు.షేర్ ఖాన్ ఒక్కడిని కాదు వందమందిని పంపించు.. అన్న
మగధీరుడిలా నిలిచాడు. వికెట్ల ముందు పడిపోతున్నాడు.

మళ్లే లేస్తున్నాడు.. వళ్లంతా గాయాలు..
బట్టలన్నీ మట్టి కొట్టుకుపోయాయి.. అయినా సరే,
అలా పరుగులు తీస్తూనే ఉన్నాడు.సరిగ్గా 97 పరుగుల దగ్గర అవుట్ అయిపోయాడు.
స్కోరు అప్పటికి 223 పరుగులు.. 41.2 ఓవర్ జరుగుతోంది.
ఇంకా విజయానికి 52 పరుగులు కావాలి. 52 బంతులు ఉన్నాయి.
నిజానికి 3 పరుగులు చేస్తే సెంచరీ పూర్తవుతుంది. కానీ అక్కడ ఒక్క బాల్ డిఫెన్స్ ఆడినా, సెంచరీ కోసం చూసినా వరల్డ్ కప్ పోతుందనే భావనతో షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు.
అతను మరెవరో కాదు.. డేరింగ్ అండ్ డేషింగ్ టీమ్ ఇండియా ఓపెనర్

- Advertisement -

గౌతం గంభీర్.. గట్స్ ఉన్న క్రికెటర్

కానీ ఆరోజు ఆ మ్యాచ్ లో మరొకరు 91 పరుగులు చేశారు. అతనే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. తను నాటౌట్ గా నిలవడమే కాదు.. మ్యాచ్ ని గెలిపించి.. వరల్డ్ కప్ ని మరొక్కసారి తీసుకొచ్చి, ఇండియా చిరకాల వాంఛ నెరవేర్చాడు. అయితే ధనాధన్ ధోనీ హవాలో.. నాటి అసలైన ఓపెనింగ్ హీరో గౌతం గంభీర్‌ని ఎవరూ గుర్తించలేదు.. పట్టించుకోలేదు.

Also Read: స్మృతి మంథాన సెంచరీ.. దక్షిణాఫ్రికా ఘోర ఓటమి

కానీ 13 ఏళ్ల తర్వాత గుర్తించారు. అది టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా గౌతంగంభీర్ కి పట్టం కడుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. ఇంక నిర్ణయం ప్రకటించడమే తరువాయి అని అంటున్నారు. రేపోమాపో ఆ శుభవార్త వెలువడనుంది. అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. గౌతం గంభీర్ ఉన్నాడంటే, అక్కడ పోరాటమే ఊపిరిగా పోరాడాలి. నిజానికి 2023 వన్డే వరల్డ్ కప్ కి కోచ్ గా ఉండి ఉంటే, ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కచ్చితంగా కప్పు గెలిచేవారమని నెటిజన్లు పేర్కొంటున్నారు.

2027 వరల్డ్ కప్ కి టీమ్ ఇండియా ను సిద్ధం చేయడమే, ఇప్పుడు గౌతం గంభీర్ ముందున్న లక్ష్యం. 2011 వరల్డ్ కప్ హీరో.. మరేం చేస్తాడో చూద్దాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News