Big Stories

BCCI Accepts Gambhir’s Demands: గౌతం గంభీర్ కోచ్.. కండీషన్స్ అప్లై !

BCCI Accepts Gautam Gambhir’s Demands: టీమ్ ఇండియా హెడ్ కోచ్ ఎవరనే సస్పెన్స్ కి తెరపడిపోయినట్టేనని అంటున్నారు. ఎందుకంటే గౌతం గంభీర్ పెట్టిన కండీషన్స్ కి బీసీసీఐ ఓకే చెప్పిందంట. దీంతో గంభీర్ కూడా డీల్ ఓకే అన్నట్టు సమాచారం. ఈ విషయాన్ని బీసీసీఐ అధికార వర్గాలు  వెల్లడించాయి.

- Advertisement -

ఇంతకీ గౌతీ.. ఏం కండీషన్స్ పెట్టాడంటే.. తన సహాయక సిబ్బందిని తనకి నచ్చిన వారినే తీసుకుంటానని అన్నాడని తెలిసింది. ఎంతో తర్జనభర్జనల అనంతరం బీసీసీఐ దీనికి ఒప్పుకోవడంతో హెడ్ కోచ్ గా రావడానికి గౌతం గంభీర్ ఓకే అన్నట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం ఉన్న సహాయక సిబ్బందిని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. ఇప్పుడు టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్ రాథోడ్, బౌలింగ్‌ కోచ్‌గా పరాస్ మంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌గా దిలీప్‌ ఉన్నారు. వీరి ప్లేసులో గంభీర్‌ తనకు నచ్చిన వారిని తీసుకునే అవకాశం ఉంది.

- Advertisement -

అయితే ఈ వార్త గౌతీ నోటి వెంట ఒక ఇంటర్వ్యూలో బయటకి వచ్చింది. తనకి టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా ఉండేందుకు ఆసక్తి ఉన్నట్టు తెలిపాడు. అప్పటి నుంచి నెట్టింట వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ ఓనర్ షారూఖ్ ఖాన్.. ఒక బ్లాంక్ చెక్ ని గౌతీకి ఇచ్చి, నీకెంత కావాలో రాసుకోమని అన్నాడంట. పదేళ్లు నువ్వే మెంటర్ గా ఉండాలి. కప్పు గెలవనీ, గెలవకపోనీ, సంబంధం లేదని అన్నాడంట. తను నవ్వుతూ ఆ ఆఫర్ ని తిరస్కరించాడు.

Also Read: పడుతూ లేస్తూ.. పాక్ ని గెలిపించిన.. బాబర్

అందుక్కారణం టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా లైనులో ఉండటమే నని ఇప్పుడందరూ గుర్తు చేస్తున్నారు.
ఐపీఎల్ 2022, 2023 సీజన్‌లలో లక్నో సూపర్ జెయింట్స్, 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మెంటార్‌గా ఉన్నాడు. గంభీర్ మార్గదర్శకత్వంలోనే కేకేఆర్.. పదేళ్ల నిరీక్షణకు తెరదించుతూ.. ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే టీమ్ ఇండియాని కూడా ముందుకు నడిపిస్తాడని బీసీసీఐ ఆశిస్తోంది. మరి టీమ్ ఇండియా 2027లో వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుస్తుందా? 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతుందా? చూడాల్సిందే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News