Big Stories

David Warner Retirement: ఇక సెలవు.. అంతర్జాతీయ క్రికెట్‌కు దిగ్గజ క్రికెటర్ గుడ్‌బై..!

David Warner Announced Retirement From International Cricket: అంతర్జాతీయ క్రికెట్‌‌లో డేవిడ్ వార్నర్ శకం ముగిసింది. ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్ జట్టు మీద తమ చివరి సూపర్ 8 మ్యాచ్‌లో విజయం సాధించడంతో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో సూపర్ 8 లో భాగంగా సోమవారం టీమిండియాతో ఆడిన మ్యాచ్ ఈ ఆసీస్ ఓపెనర్‌కు చివరి మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో వార్నర్ 6 బంతుల్లొ 6 పరుగులు చేసి నిరాశ పరిచాడు.

- Advertisement -

అటు ఈ మ్యాచ్ ఓడిన కంగారూ జట్టు ఆఫ్గనిస్తాన్ మ్యాచ్ రిజల్ట్ కోసం వేచిచూసింది. ఆఫ్గనిస్తాన్ బంగ్లాదేశ్‌పై ఉత్కంఠ పోరులో విజయం సాధించి అటు ఆస్ట్రేలియా జట్టు ప్రపంచకప్ ప్రస్థానం, ఇటు వార్నర్ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికింది.

- Advertisement -

ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఈ సంవత్సరం ప్రారంభంలో పాకిస్థాన్‌తో జరిగిన సిడ్నీ టెస్టు ముందు వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆ తరువాత సిడ్నీ టెస్ట్ తన చివరి టెస్ట్ అని అటు టెస్ట్ క్రికెట్‌కు కూడా ముగింపు పలికాడు. ఆ తరువాత టీ20 ప్రపంచ కప్ తర్వాత టీ20 నుంచి కూడా రిటైర్మంట్ ప్రకటించాడు. తాజాగా టీ20 ప్రపంచ కప్ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణతో వార్నర్ టీ20 ప్రస్థానం కూడా ముగిసింది.

Also Read: T20 World Cup 2024 Semi-Finals: రేపే రెండు సెమీఫైనల్స్.. టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లండ్.. ఆఫ్గాన్ వర్సెస్ సౌతాఫ్రికా

ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ ఇప్పటివరకు 112 టెస్టు మ్యాచుల్లో 26 సెంచరీల సాయంతో 8,786 పరుగులు చేశాడు. 161 వన్డే మ్యాచుల్లో 22 సెంచరీల సాయంతో 6,932 పరుగులు చేశాడు. ఇక టీ20ల విషయానికి వస్తే 110 మ్యాచుల్లో ఒక సెంచరీ సాయంతో 3277 పరుగులు చేశాడు.

డేవిడ్ వార్నర్ రికార్డుల విషయానికొస్తే ఆస్ట్రేలియా తరఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు. వార్నర్ కంటే ముందు ఈ జాబితాలో రికీ పాంటింగ్, గిల్‌క్రిస్ట్, మార్క్ వా, మైకేల్ క్లార్క్, స్టీవ్ వా ఉన్నారు.

వార్నర్ 2025 పాకిస్థాన్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి అందుబాటులో ఉంటానని ఇదివరకే తెలిపాడు. కాగా అందులో వార్నర్ రీఎంట్రీ అనుమానమే.

Also Read: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో అఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మందికి ఊపిరినిచ్చిన ఐపీఎల్ వార్నర్‌కు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టడానికి అవకాశాన్నిచ్చింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ఆడిన అతను వీరేంద్ర సెహ్వాగ్ దగ్గర మెలుకువలు నేర్చుకుని అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. జనవరి 11 2009లో టీ20 ప్రపంచ క్రికెట్‌లో అరంగ్రేటం చేసిన వార్నర్.. సౌతాఫ్రికాతో జనవరి 18 2009లో జరిగిన వన్డే మ్యాచ్‌లో అరంగ్రేటం చేశాడు. ఇక టెస్టు క్రికెట్ అరంగ్రేటం కోసం వార్నర్ రెండేళ్లు వేచి చూడాల్సి వచ్చింది.

మూడు ఫార్మాట్లలో వార్నర్ తిరుగులేని ఆటగాడిగా ఎదిగాడు. హేడెన్, గిల్‌క్రిస్ట్ లాంటి మేటి ఆటగాళ్లు లోటును అద్భుతంగా భర్తీ చేశాడు. ఇక ఐపీఎల్లో తెలుగు వారికి వార్నర్ కుటుంబ సభ్యుడు లాంటి వాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 2016లో టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆటలోనే కాకుండా వార్నర్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాడు. ఎంతైనా వార్నర్ ఆటకు దూరం కావడం సగటు క్రికెట్ అభిమానికి మింగుడుపడటం లేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News