Big Stories

AUS Vs IND T20 World Cup 2024 Live Updates: సెమీస్‌కు టీమిండియా.. ఆసీస్‌పై ఘనవిజయం..

Australia vs India Super 8 Group 1 T20 World Cup 2024 Live Scores: ఆస్ట్రేలియా- ఇండియా సూపర్ 8 మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్..

- Advertisement -
  • హార్థిక్ వేసిన 20వ ఓవర్ తొలి బంతికి కమిన్స్ 2, రెండో బంతికి క్యాచ్ డ్రాప్ చేసిన జడేజా, 3వ బంతి, 4వ బంతికి డాట్, 5వ బంతికి డాట్, చివరి బంతికి డాట్.. 20 ఓవర్లలో ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. దీంతో 24 పరుగులతో టీమిండియా విజయం సాధించింది.
  • ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 29 పరుగులు
  • బుమ్రా వేసిన 19వ 3వ బంతికి కమిన్స్ సిక్స్.. మొత్తంగా ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
  • ఆసీస్ విజయానికి 12 బంతుల్లో 39 పరుగులు
  • అర్షదీప్ వేసిన 18వ ఓవర్ తొలి బంతికే వేడ్ అవుట్.. క్రీజులోకి కమిన్స్.. మూడో బంతికి టిమ్ డేవిడ్ ఫోర్.. 4వ బంతికి సిక్స్.. 5వ బంతికి డేవిడ్ అవుట్
  • ఆసీస్ విజయానికి 18 బంతుల్లో 53 పరుగులు
  • బుమ్రా వేసిన 17వ ఓవర్లో హెడ్(76) అవుట్.. క్రీజులోకి వేడ్.. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి
  • ఆసీస్ విజయానికి 24 బంతుల్లో 58 పరుగులు
  • అర్షదీప్ వేసిన 16వ ఓవర్లో రెండో బంతికి హెడ్ ఫోర్.. మొత్తంగా ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
  • ఆసీస్ విజయానికి 30 బంతుల్లో 65 పరుగులు
  • అక్షర్ పటేల్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి స్టోయినిస్ అవుట్.. 5వ బంతికి హెడ్ ఫోర్.. క్రీజులోకి టిమ్ డేవిడ్
  • ఆసీస్ విజయానికి 36 బంతుల్లో 71 పరుగులు
  • కుల్దీప్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికి మ్యాక్స్‌వెల్ అవుట్.. క్రీజులోకి స్టోయినిస్.. 4వ బంతికి హెడ్ ఫోర్ బాదడంతో ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.
  • ఆసీస్ విజయానికి 42 బంతుల్లో 78 పరుగులు
  • అక్షర్ పటేల్ వేసిన 13వ ఓవర్లో కేవలం 3 పరుగులు మాత్రమే వచ్చాయి.
  • కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్ చివర్ బంతికి హెడ్ సిక్స్.. 12 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 125/2
  • జడేజా వేసిన 11వ ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్‌వెల్ ఫోర్, రెండో బంతికి రివర్స్ స్వీప్ సిక్స్.. 5వ బంతికి ఫోర్ బాదిన మ్యాక్స్‌వెల్.. ఈ ఓవర్లో 17 పరుగులు రావడంతో ఆసీస్ స్కోర్ 116/2
  • డ్రింక్స్ బ్రేక్
  • హార్థిక్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి హెడ్ ఫోర్. 4వ బంతికి బౌండరీ సాధించడంతో 24 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ.. 5వ బంతికి ఫోర్.. మొత్తంగా ఈ ఓవర్లో 12 పరుగులు రావడంతో ఆసీస్ స్కోర్ 99/2
  • కుల్దీప్ యాదవ్ వేసిన 9వ ఓవర్ చివరి బంతికి మార్ష్ అవుట్.. అక్షర్ పటేల్ అందుకున్న అద్భుత క్యాచ్‌కు మార్ష్ పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. 9 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 87/2..
  • హార్థిక్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి హెడ్ 4, 3వ బంతికి హెడ్ 6.. మొత్తంగా 14 పరుగులు రావడంతో 8 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 84/1
  • కుల్దీప్ యాదవ్ వేసిన 7వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో  ఓవర్లకు ఆసీస్ స్కోర్ 69/1
  • దీంతో రంగంలోకి కుల్దీప్ యాదవ్
  • హార్థిక్ వేసిన 6వ ఓవర్ రెండో బంతికి హెడ్ సిక్స్.. చివరి బంతికి మరో సిక్స్ బాదిన హెడ్.. పవర్ ప్లే ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 65/1
  • అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్ 3వ బంతికి మార్ష్ సిక్స్, 5వ బంతికి ఫోర్.. మొత్తంగా 5 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 48/1
  • బుమ్రా వేసిన 4వ ఓవర్ తొలి రెండు బంతులను బౌండరీకి తరలించాడు హెడ్, 4వ బంతికి ఫోర్.. మొత్తంగా ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి
  • అర్షదీప్ వేసిన 3వ ఓవర్లో మార్ష్ 4,4,6 బాదడంతో ఆ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి.
  • బుమ్రా వేసిన రెండో ఓవర్లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 2 ఓవర్లకు ఆసీస్ స్కోర్ 8/1
  • అర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్ 5వ బంతికి వార్నర్ ఫోర్, చివరి బంతికి వార్నర్ అవుట్.. మొదటి ఓవర్ ముగిసేసరికి ఆసీస్ స్కోర్ 6/1
  • బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. క్రీజులోకి ఓపెనర్లు హెడ్, వార్నర్..
  • ఆస్ట్రేలియా టార్గెట్ 206
  • కమిన్స్ వేసిన 20వ ఓవర్లో జడేజా సిక్స్.. దీంతో రెండు వందలు దాటిన టీమిండియా స్కోర్.. 20 ఓవర్లకు టీమిండియా స్కోర్ 205/5
  • స్టోయినిస్ వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతులకు హార్ధిక్ సిక్సర్లు.. 4వ బంతికి దూబె అవుట్.. క్రీజులోకి జడేజా.. 19 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 195/5
  • కమిన్స్ వేసిన 18వ ఓవర్లో హార్థిక్ ఫోర్ బాదడంతో ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి.
  • జంపా వేసిన 17వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతొ 17 ఓవర్లకు టీమిండియా స్కోర్ 171/4
  • హేజిల్‌వుడ్ వేసిన 16వ ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే వచ్చాయి
  • స్టార్క్ వేసిన 15వ ఓవర్ తొలి బంతికి సూర్య ఫోర్, 3వ బంతికి అవుట్.. దీంతో 4వ వికెట్ కోల్పోయిన టీమిండియా.. క్రీజులోకి హార్థిక్ పాండ్యా.. మొత్తంగా 15 ఓవర్లు ముగిసేసరికి 162/4
  • స్టోయినిస్ వేసిన 14వ ఓవర్ రెండో బంతికి దూబె ఫోర్, 4వ బంతికి సూర్య సిక్స్.. మొత్తంగా 14 ఓవర్లు ముగిసేసరికి 155/3
  • జంపా వేసిన 13వ ఓవర్ 5వ బంతికి దూబె సిక్స్.. 13 ఓవర్లకు టీమిండియా స్కోర్ 142/3
  • స్టార్క్ వేసిన 12వ ఓవర్ రెండో బంతికి రోహిత్ అవుట్.. 41 బంతుల్లో 92 పరుగులు చేసిన హిట్ మ్యాన్.. తొలి బంతికి దూబె ఫోర్.. 12 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 131/3
  • కమిన్స్ వేసిన 11వ ఓవర్ 5వ బంతికి సూర్య ఫోర్, చివరి బంతికి సిక్స్.. మొత్తంగా ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. దీంతో 11 ఓవర్ ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 127 పరుగులు వచ్చాయి.
  • డ్రింక్స్ బ్రేక్
  • స్టోయినిస్ వేసిన 10వ ఓవర్ తొలి బంతికి రోహిత్ ఫోర్, 3వ బంతికి రోహిత్ ఫోర్.. 10 ఓవర్లకు టీమిండియా స్కోర్ 114/2
  • జంపా వేసిన 9వ ఓవర్లో 4వ బంతికి సూర్య ఫోర్.. దీంతో 100 పరుగులకు చేరుకున్న టీమిండియా స్కోర్.. మొత్తంగా 9 ఓవర్లకు టీమిండియా స్కోర్ 102/2
  • స్టోయినిస్ వేసిన 8వ ఓవర్ 2వ బంతికి రోహిత్ ఫోర్, 3వ బంతికి సిక్స్, 4వ బంతికి సిక్స్.. చివరి బంతికి పంత్(15) అవుట్.. క్రీజులోకి సూర్య కుమార్ యాదవ్.. 8 ఓవర్లకు ఇండియా స్కోర్ 93/2
  • ఆడమ్ జంపా వేసిన 7వ ఓవర్ తొలి బంతికే పంత్ సిక్స్, 5వ బంతికి రోహిత్ సిక్స్.. మొత్తంగా ఈ ఓవర్లో 16 పరుగులు రావడంతో టీమిండియా స్కోర్ 76/1
  • స్పినర్‌ను రంగంలోకి దించిన ఆసీస్ కెప్టెన్ మార్ష్..
  • హేజిల్‌వుడ్ వేసిన 6వ ఓవర్లో పంత్ ఫోర్.. పవర్ ప్లే మగిసేసరికి టీమిండియా స్కోర్ 60/1
  • కమిన్స్ వేసిన 5వ ఓవర్ 3వ బంతికి రోహిత్ ఫోర్, 5వ బంతికి ఫోర్.. దీంతో 50 పరుగులు దాటిన టీమిండియా స్కోర్. చివరి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ(19 బంతుల్లో).. 5 ఓవర్లకు టీమిండియా స్కోర్ 52/1
  • తిరిగి ప్రారంభమైన మ్యాచ్
  • వర్షం కారణంగా మ్యాచ్‌కు ఆటంకం.. 4.1 ఓవర్లకు టీమిండియా స్కోర్ 43/1
  • కమిన్స్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి రోహిత్ భారీ సిక్సర్..
    దీంతో టీ20I చరిత్రలో 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ రికార్డు
  • హేజిల్‌వుడ్ వేసిన నాలుగో ఓవర్లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి
  • స్టార్క్ వేసిన మూడో ఓవర్ తొలి రెండు బంతులకు సిక్సర్లు బాదిన రోహిత్, మూడో బంతికి ఫోర్, నాలుగో బంతికి సిక్స్, చివరి బంతికి సిక్స్.. మొత్తంగా ఈ ఓవర్లో 29 పరుగులు సాధించిన రోహిత్.. 3 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 35/1
  • హేజిల్‌వుడ్ వేసిన రెండో ఓవర్లో కోహ్లీ డకౌట్.. క్రీజులోకి రిషబ్ పంత్.. రెండు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోర్ 6/1
  • స్టార్క్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికి బౌండరీతో ఖాతా తెరిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తొలి ఓవర్ ముగిసేసరికి టీమిండియా స్కోర్ 5/0
  • క్రీజులోకి భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కోహ్లీ..తొలి ఓవర్ వేయడానికి సిద్ధంగా ఉన్న స్టార్క్

టీ20 ప్రపంచ కప్‌ సూపర్ 8లో భాగంగా సెయింట్ లూసియాలో టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

- Advertisement -
జట్లు ఇవే:

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్(c), గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్(w), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

ఇండియా: రోహిత్ శర్మ (C), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (W), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News