Big Stories

AUS vs BAN HighlightsT20 World Cup 2024: ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్.. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియా గెలుపు

Australia Vs Bangladesh Highlights Pat Cummins: అందరూ అనుకుంటున్నట్టుగానే సూపర్ 8 మ్యాచ్ లకు వర్షం ఆటంకం మొదలైంది. ఆంటిగ్వాలో వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కి వర్షం అంతరాయం కలిగించింది. అయితే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ తీసి సంచలనం సృష్టించాడు.

- Advertisement -

టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ కి వచ్చి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దూసుకుపోతున్న ఆస్ట్రేలియాకి వరుణుడు పదేపదే అంతరాయం కలిగించాడు. అలా 11.2 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. అప్పుడు మళ్లీ వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో ఆస్ట్రేలియాను విజేతగా ప్రకటించారు. 28 పరుగుల తేడాతో గెలిచినట్టు లెక్కలు కట్టారు.

- Advertisement -

141 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకి వరుణుడి ఎఫెక్ట్ ఉందని తెలిసి, ధనాధన్ ఆడారు. ఈ క్రమంలో ఓపెనర్లు ఇద్దరు అదరగొట్టారు. డేవిడ్ వార్నర్ 35 బంతుల్లో 3 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 53 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తర్వాత మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 21 బంతుల్లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

రన్ రేట్ పెంచే క్రమంలో కెప్టెన్ మార్ష్ (1) వెంటనే అయిపోయాడు. అనంతరం వచ్చిన మ్యాక్స్ వెల్ (14) నాటౌట్ గా నిలిచాడు. ఈ సమయంలో వరుణుడు రావడంతో మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి ఆస్ట్రేలియా 11.2 ఓవర్లలో సరిగ్గా 100 పరుగులు చేసింది. డక్ వర్త్ లుయిస్ పద్ధతి ప్రకారం ఆస్ట్రేలియా టార్గెట్ ను 73 పరుగులు గా నిర్ధారించారు. దీంతో అప్పటికి 100 పరుగులు చేయడంతో 28 పరుగుల తేడాతో విజయం సాధించినట్టు ప్రకటించారు.

బంగ్లాదేశ్ బౌలింగులో రషీద్ హొసైన్ ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. మిగిలినవాళ్లందరూ పరుగులు ధారాళంగా ఇచ్చారు.

అంతకముందు బంగ్లాదేశ్ బ్యాటింగ్ కి వచ్చింది. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, పేసర్ ప్యాటి కమిన్స్ హ్యాట్రిక్ ధాటికి విలవిల్లాడింది. 18వ ఓవర్ లో మహ్మదుల్లా, మెహ్‌దీ హసన్‌ను అవుట్ చేశాడు. చివరి ఓవర్ తొలి బంతికి తౌహిద్ హృదయ్ ను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు.

Also Read: భారత్ బిజీ షెడ్యూల్.. రానున్న బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్

అయితే మొదట బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఓపెనర్లు టాంజిద్ హాసన్ (0) , లిటన్ దాస్ (16) ఇద్దరూ శుభారంభం ఇవ్వలేదు. అయితే కెప్టెన్ మాత్రం నజ్ముల్ హొసైన్ షాంతో (41) ఒక్కడూ కాసేపు పోరాడాడు. తనకి తౌవిద్ హృదయ్ (40) సహకరించాడు. చివర్లో షకీబ్ (8), మహ్మదుల్లా (2), మెహదీ హాసన్ (0),  తస్కిన్ అహ్మద్ (13) ఇలా అవుట్ అయిపోయారు.  మొత్తానికి  8 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా బౌలింగులో ప్యాట్ కమిన్స్ 3, అడమ్ జంపా 2, మార్కస్ స్టోనిస్ 1, గ్లెన్ మ్యాక్స్ వెల్ 1, మిచెల్ స్టార్క్ 1 వికెట్లు పడగొట్టారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News