Big Stories

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ నుంచి ఆసీస్ అవుట్.. టీమ్ ఇండియా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

Australia Exit From T20 World Cup 2024 Tournament: వరల్డ్ కప్ చరిత్రలో ఆప్గనిస్తాన్ తొలిసారి సెమీస్ చేరి చరిత్ర స్రష్టించింది. ఈ క్రమంలో తను గెలవడమే కాదు, పరోక్షంగా భారత అభిమానులను కూడా సంతోష సాగరంలో ముంచెత్తింది. అదెలాగంటే సెమీస్ లోకి ఆస్ట్రేలియా రాకుండా అడ్డుపడింది. నిజానికి సూపర్ 8లో ఆ జట్టుపై గెలిచిన టీమ్ ఇండియా సగం మాత్రమే తన పనిచేసింది.

- Advertisement -

అంటే ఆనాడు 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో జరిగిన ఘోర పరాభవానికి బదులు తీర్చుకుందని మనవాళ్లు సరిపెట్టుకున్నారు. అప్పటికి ఆస్ట్రేలియాకి సెమీస్ దారులు ఇంకా మూసుకుపోలేదు. ఈ నేపథ్యంలో బంగ్లా పై జరిగిన హై ఓల్టేజి మ్యాచ్ లో గెలిచిన ఆఫ్గనిస్తాన్…ఆ రెండో సగం పూర్తి చేసింది. అంటే ఆస్ట్రేలియాను ఎకాఎకి టోర్నమెంటు నుంచి ఇంటికి సాగనంపింది. ఇది భారత అభిమానులకు ఎనలేని కిక్ ఇచ్చింది.

- Advertisement -

ఇప్పుడు కదా.. నిజమైన సంతోషం, ఇది కదా నిజమైన ఆనందం అని ఫ్యాన్స్ అంతా ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఎందుకంటే గత 11 ఏళ్లుగా టీమ్ ఇండియాకి కంటిలో నలుసుగా, పంటిలో రాయిగా ఆస్ట్రేలియా మారిపోయింది. ఎప్పుడు చూడు ఫైనల్ మ్యాచ్ లో ఎదురుపడటం, టీమ్ ఇండియాకి థమ్కీ ఇచ్చి కప్ పట్టుకుపోవడం సర్వ సాధారణమైపోయింది.

Also Read: బంగ్లాదేశ్‌పై సంచలన విజయం, సెమీస్‌లో అఫ్గాన్, ఇంటికి ఆస్ట్రేలియా

టెస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీ, 2003, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ , 2007 టీ 20 వరల్డ్ కప్ సెమీఫైనల్, 2016 టీ 20 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ ఇలా ప్రతి సందర్భంలో ఆస్ట్రేలియా ఇండియాకి ప్రాణసంకటంలా మారింది. అయితే ఇలా టోర్నీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించడం కూడా టీమ్ ఇండియాకి శుభ పరిణామం అంటున్నారు. అప్పుడే మన టీమ్ ఇండియా ట్రోఫీ గెలుస్తుందని అంటున్నారు.

ఆఫ్గాన్ గెలుపు, ఆస్ట్రేలియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించడంతో నెట్టింట మీమ్స్ కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. సోషల్ మీడియా అంతా ఒక పండగలా ఉంది. పనిలో పని పాకిస్తాన్ కి కూడా కొంత తగిలిస్తున్నారు. అయితే అవి మరీ వివాదాస్పదంగా ఉంటున్నాయి. మొత్తానికి టీమ్ ఇండియా ఫ్యాన్స్ అయితే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమిని మరిచిపోలేకపోతున్నారు. నేడు కొంత సాంత్వన పొందుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News