Big Stories

Afghanistan vs India: సూపర్ 8 పోరు.. ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆఫ్గనిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

Afghanistan vs India Super 8 T20 World Cup 2024: ఆఫ్గనిస్తాన్-ఇండియా సూపర్ 8 మ్యాచ్ అప్డేట్స్..

- Advertisement -

బార్బడోస్ వేదికగా జరుగుతున్న సూపర్ 8 పోరులో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్(53) హాఫ్ సెంచరీతో రాణించాడు.

- Advertisement -

ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రోహిత్ శర్మ 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత వచ్చిన పంత్ దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఈ క్రమంలో రివర్స్ స్వీప్ ఆడబోయి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

ఆ తరువాత 24 పరుగులు చేసిన కోహ్లీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. ఆ తరువాత శివమ్ దూబె అవుట్ అయ్యాడు. ఆ తరువాత సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్య(32) రాణించడంతో 181 పరుగులు చేసింది.

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా బార్బడోస్ వేదికగా ఆఫ్గనిస్తాన్‌‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా ప్లేయింగ్ 11 లోకి సిరాజ్ స్థానంలో కుల్దీప్ యాదవ్ వచ్చాడు. ఆఫ్గనిస్తాన్ జట్టులోకి జజాయ్ వచ్చాడు.

బుమ్రా దెబ్బకు విలవిల..
భారత్‌ విధించిన లక్ష్యఛేదనలో అఫ్గాన్ తడబడింది. బుమ్రా దెబ్బకు అఫ్గాన్ బ్యాటర్లు విలవిల కొట్టుకున్నారు. ఓపెనర్ గుర్బాజ్(11) పరుగులే బుమ్రా తొలి వికెట్ తీశాడు. తర్వాత జజాయ్(2)ను ఔట్ చేశాడు. మధ్యలో జద్రాన్(8) ఔట్ కావడంతో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. నైబ్(17), అజ్మతుల్లా(26), నజిబుల్లా(19), నబి(14) ఆదుకునే ప్రయత్నం చేశారు. 20 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో బుమ్రా, అర్షదీప్ చెరో మూడు వికెట్లు, కుల్దీప్ రెండు, అక్షర్ పటేల్, జడేజా తలో వికెట్ పడకొట్టారు.

జట్ల వివరాలు

భారత్: రోహిత్ శర్మ(సి), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్(w), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా

ఆఫ్గనిస్తాన్: రహ్మానుల్లా గుర్బాజ్(w), ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్, హజ్రతుల్లా జజాయ్, గుల్బాదిన్ నైబ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్(c), నూర్ అహ్మద్, నవీన్-ఉల్-హక్, ఫరూజ్కాల్హాక్

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News