Big Stories

Afghanistan Cricket Board : మీ ముగ్గురు ఐపీఎల్ ఆడొద్దు.. ఆఫ్గాన్ బోర్డు అల్టిమేటం..

Afghanistan Cricket Board : ఆ ముగ్గురు క్రికెటర్లు ఆఫ్గనిస్తాన్ జట్టులో కీలక సభ్యుల్లా ఉన్నారు. ఐపీఎల్ లో కూడా వారికి మంచి రికార్డే ఉంది. దీంతో వాళ్లు ముగ్గురు ఏం చేస్తున్నారంటే జాతీయ జట్టుకి ఆడకుండా లీగ్ లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు తమని వార్షిక సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తప్పించాలని బోర్డుని కోరారు. అంటే ఇన్ డైరక్టుగా జట్టుకి ఎంపిక చేయవద్దని అడిగినట్టయ్యింది. దీంతో వళ్లు మండిన ఆఫ్గాన్ బోర్డు దీనిని సీరియస్ గా తీసుకుంది.

- Advertisement -

దేశం కోసం ఆడకుండా, సొంత ప్రయోజనాల కోసం ఆడటం సరికాదని భావించి, ఆ ముగ్గురిపై అంతర్గతంగా ఒక విచారణ కమిటీని నియమించింది. అంతేకాదు వారికి ఎన్ ఓసీ ( నో అబ్జక్షన్ సర్టిఫికెట్) కూడా ఇవ్వలేదు. అంటే లీగ్ ల్లో ఆడేందుకు అనుమతివ్వలేదు. ఇంత పెద్ద రచ్చ చేసుకున్న ఆ ముగ్గురు ఎవరంటే…
నవీనుల్ హక్, ముజీబుర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫరూఖీలు…

- Advertisement -

ఒకవేళ వీరికి అనుమతి రాకపోతే 2024 ఐపీఎల్ ఆడటం అనుమానంగానే ఉంది. అయితే వీరు మినహా అప్ఘానిస్థాన్‌కు చెందిన రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వంటి ప్లేయర్లు ఐపీఎల్‌లో యథావిథిగా ఆడనున్నారు. ఇంతకీ వీరు ఐపీఎల్ లో ఎవరి తరఫున ఆడుతున్నారంటే  కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు రూ.2 కోట్లకు ముజీబ్ రెహ్మాన్‌ను తాజాగా సొంతం చేసుకుంది. నవీనుల్ హక్‌ను లక్నో సూపర్ జెయింట్స్, ఫజల్ హక్ ఫరుఖీని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు అట్టే పెట్టుకున్నాయి. కొందరు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్ 2024లో ఆడుతున్నారు. వీరి కాంట్రాక్టు కూడా రద్దయ్యేలాగే ఉంది. ఒకరిద్దరి ఎన్ఓసీని ఆఫ్గాన్ బోర్డు రద్దు చేసి పారేసింది.

ఎన్నో కఠిన పరీక్షలను ఎదుర్కొని జాతీయ జట్టులో చోటు సంపాదించిన ఆటగాళ్లు తర్వాత కాలంలో ఆర్థిక అవసరాల కోసం లీగ్ లవైపు దృష్టి సారిస్తున్నారు. జాతీయ జట్టులో ఆడుతూనే వాటికి సమయం కేటాయించాల్సి ఉంటుంది. లేదంటే ఆ సమయంలో ఆఫ్గాన్ జట్టు టూర్స్ ఉంటే, వాటికే ఫస్ట్ ప్రయార్టీ ఇవ్వాల్సి ఉంటుంది. లీగ్ ల్లో ఆడేవారికి, ఆ వెసులుబాటు ఉంటుంది. అందుకు అనుగుణంగానే ఆ బోర్డు నుంచి ఎన్ ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. అలా వచ్చినప్పుడే ఐపీఎల్ లేదా ఏ లీగ్ లైనా ఆడవచ్చు.

కానీ ఆఫ్గాన్ జాతీయ జట్టులో కీలకమైన ఏడెనిమిది మంది ప్లేయర్లు ఇలా లీగ్ లకు వెళతామంటూ అసలు కుండకే ఎసరు పెట్టడంతో బోర్డు సీరియస్ అయ్యి, చర్యలకు ఉపక్రమిస్తోంది. వారి కమిటీలో నిజాలు తేలితే, ఐపీఎల్ లో ఆడకుండా ఈ ముగ్గురిపై రెండేళ్ల నిషేధం విధించే అవకాశాలున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News