WhatsApp new feature : ప్రస్తుతం సోషల్ మీడియా యాప్స్‌లో కలుగుతున్న కొత్త కొత్త మార్పులు యూజర్లు సైతం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. సోషల్ మీడియా యాప్స్ మధ్య పెరుగుతున్న పోటీ.. అవి మరింత క్రియేటివ్‌గా ఆలోచించేలా చేస్తున్నాయి. ముఖ్యంగా కేవలం మెసేజింగ్ యాప్‌లాగా ప్రారంభమయిన వాట్సాప్.. ఇప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తన రూపాన్ని మార్చుకుంది. తాజాగా వాట్సాప్‌లో మరో కొత్త అప్డేట్ వచ్చింది. అది మీ తప్పులను సరిదిద్దుకునేలా చేస్తుంది.
ప్రస్తుతం మెటా అనే ఒక ప్రపంచంలో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్స్ భాగమయ్యాయి. వీటన్నింటిని శాసిస్తున్నాడు మార్క్ జుకెన్‌బర్గ్. తాజాగా మార్క్ తన ఫేస్‌బుక్‌లో ఒక కొత్త అప్డేట్ గురించి బయటపెట్టాడు. వాట్సాప్‌లో మేసేజ్ పంపిన తర్వాత కూడా 15 నిమిషాల వరకు దానిని ఎడిట్ చేసుకునే సౌకర్యం ఉంటుందని ప్రకటించాడు. ఈ కొత్త ఫీచర్.. యూజర్లలో ఆసక్తి పెరిగేలా చేస్తుంది. ఇప్పటివరకు మెసేజ్ పంపిన తర్వాత డిలీట్ చేసే సౌలభ్యం ఉండేది.. ఇప్పుడు అలా కాకుండా దానిని ఎడిట్ చేసుకునే సౌలభ్యం కూడా లభించనుంది.
వాట్సాప్‌లో పంపిన మెసేజ్‌ను ఎడిట్ చేసుకోవాలంటే.. ముందుగా ఆ మెసేజ్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అక్కడ కనిపించే ఆప్షన్స్‌లో ఎడిట్‌ను ఎంపిక చేసుకొని మెసేజ్‌లను ఎడిట్ చేసుకోవచ్చు. కాకపోతే ఆ మెసేజ్‌ను ఎడిట్ చేశారని అవతల వ్యక్తికి తెలిసేలా.. ఎడిటెడ్ అనే ట్యాగ్ మెసేజ్ పక్కన కనిపిస్తుందని వాట్సాప్ యాజమాన్యం చెప్తోంది. అంతే కాకుండా ఈ ఎడిట్ ఆప్షన్ విషయంలో కూడా వాట్సాప్.. యూజర్లకు ప్రైవసీని అందిస్తోంది. పాత మెసేజ్ హిస్టరీని తమ వద్ద స్టోర్ చేసుకోమని, ఎడిట్ కాకముందు పంపిన మెసేజ్‌లను యూజర్లకు చూపించమని వాట్సాప్ యాజమాన్యం మాటిస్తోంది.
Leave a Comment