Big Stories

Xiaomi 14T Pro Launching: ఫోటోల పిశాచి.. షియోమీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్.. ఏముంది కాక.. చూస్తే కేకే..!

Xiaomi 14T Pro Launching Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ షియోమీ‌కి మంచి ప్రజాదరణ ఉంది. కంపెనీ ఎంట్రీతోనే చవకైన ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో అన్నీ ఇతర బ్రాండ్లు తప్పనిసరిగా ధరలను తగ్గించాల్సి వచ్చింది. షియోమీకి సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉందనే చెప్పాలి. దీని నుంచి ఏదైనా కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే మొబైల్ లవర్స్ ఎదురుచూస్తుంటారు. ఈ నేపథ్యంలోనే  Xiaomi త్వరలో 14T సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Xiaomi 14T Pro గ్లోబల్ వేరియంట్ థాయిలాండ్ NBTC సర్టిఫికేషన్ డేటాబేస్‌లో గుర్తించబడింది.

- Advertisement -

NBTC ధృవీకరించిన దాని ప్రకారం 14T Pro మోడల్ నంబర్ 2407FPN8EG ఉంటుంది. ఇందులో GSM, LTE, WCDMA, NR కనెక్టివిటీకి సపోర్ట్ ఉంది.ఇది కాకుండా రాబోయే ఫోన్ కెమెరా FV-5 డేటాబేస్‌లో కూడా ఉంది. కెమెరా FV-5 డేటాబేస్ ఫోన్ కెమెరా సెటప్‌ను వెల్లడిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ f/1.6 ఎపర్చరు, 12.6MP పిక్సెల్ బిన్నింగ్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన ప్రైమరీ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: మరో బాహుబలి.. బడ్జెట్లో గాజు ఫోన్.. రూ.7 వేలకే దక్కించుకోవచ్చు..!

పిక్సెల్ బిన్నింగ్‌తో కూడిన 12.6MP రిజల్యూషన్ అంటే ఫోన్‌లో 50MP మెయిన్ సెన్సార్ కెమెరాతో ఉంటుంది. అదే సమయంలో ఇది f/2.0 ఎపర్చరుతో సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.8.1MP పిక్సెల్-బిన్డ్ చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫోన్‌లో కోకా-కోలా కో-బ్రాండింగ్ కూడా ఉండవచ్చు. ఇందులో MediaTek డైమెన్సిటీ 9300 ప్రాసెసర్‌ ఉంటుంది.

Xiaomi 14T సిరీస్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే షియోమీ T సిరీస్‌లో మొదటిది స్మార్ట్‌ఫోన్ ఇది. T సిరీస్ ఫోన్లు సాధారణంగా ప్రాసెసర్‌లతో స్టాండర్డ్, ప్రో మోడల్‌లను వేరు చేస్తుంది. షియోమీ 13T, 13T ప్రో రెండూ ఒకే రకమైన కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను కలిగి ఉన్నాయి. కాబట్టి అటువంటి పరిస్థితిలో 14Tలోనూ ఇలాంటి బ్యాటరీ, కెమెరా సెటప్ ఉంటాయి.

Also Read: అన్నీ గాల్లోనే.. ఫోన్‌పై రూ.4 వేల డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!

Xiaomi 14T సిరీస్‌ లాంచ్ విషయానికి వస్తే ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం కంపెనీ Xiaomi 14T సిరీస్‌ను ఆగస్టు లేదా సెప్టెంబర్ 2024లో ప్రారంభించవచ్చు. అయితే Xiaomi 14T సిరీస్ భారత్‌లోకి తీసుకొస్తారో లేదో చూడాల్సి ఉంది. షియోమీ భారత మార్కెట్‌లో 12T, 13T సిరీస్‌లను అందుబాటులోకి తీసుకురాలేదు. ఇవి చైనా మార్కెట్‌లో ఉన్నాయి. ఈసారి కూడా బ్రాండ్ టి సిరీస్‌ను భారతదేశంలో ప్రారంభించలేకపోవచ్చని టాక్ వినిపిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News