Big Stories

Xiaomi 14T Pro Features: ఏమి తేజస్సు.. షియోమీ నుంచి కిరాక్ ఫోన్.. ఇక వాటికి చుక్కలే..!

Xiaomi 14T Pro Features Leaked: ఇండియాలో టెక్ మార్కెట్‌లో ఒకప్పుడు షియోమీ స్మార్ట్‌ఫోన్లు హట్ కేకుల్లా అమ్ముడుపోయేవి. కానీ ఇప్పుడు వాటి అమ్మకాలకు కాస్త జోరుతగ్గింది. ఎందుకంటే ఇతర కంపెనీలు ఫోన్లను తక్కుద ధరకే ప్రీమియం ఫీచర్లను ఆఫర్ చేస్తున్నాయి. ఈ పోటీని తట్టుకునేందుకు కంపెనీ సిద్ధమైంది. మంచి మెరుగైన యూజర్ ఎక్స్‌పీరియన్స్, అప్‌డేటెడ్ ఫీచర్లను అందించి తన సేల్స్ పెంచుకోవాలని చూస్తుంది.

- Advertisement -

ఇందులో భాగంగా తన తాజా స్మార్ట్‌ఫోన్ Xiaomi 14T Pro తీసుకొస్తుంది. ఈ రాబోయే ఫోన్ మోడల్ నంబర్ 2407FPN8EGతో థాయిలాండ్ NBTC సర్టిఫికేషన్‌లో గుర్తించబడింది. ఈ సిరీస్‌లో ఇప్పుడు NBTC సర్టిఫికేషన్ Xiaomi 14T Proని అమోదించింది. దీని ద్వారా  Xiaomi 14T సిరీస్ త్వరలో థాయిలాండ్‌లో విడుదలవుతుంది. అయితే స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి ముందు దాని ధర, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: ఊచకోతే.. వివో మిడ్ రేంజ్ ఫోన్.. డబ్బులు దాచుకో!

Xiaomi 13T గత ఏడాది జూలై చివరి నాటికి NBTC నుండి ఆమోదం పొందింది. ఆ తర్వాత 13T Pro ఆగస్టు ప్రారంభంలో ఆమోదం పొందింది. ఈ రెండు డివైజ్‌లు సెప్టెంబర్ చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్‌లో విడుదల అవుతాయి. Xiaomi 14T, 14T Proలు వాటి ముందు మోడల్‌ల కంటే దాదాపు ఒక నెల ముందుగానే NBTC ఆమోదం పొందడం ద్వారా 14T సిరీస్ త్వరలో ప్రారంభించే అవకాశం ఉంది. ఈ ఫోన్ ఆగస్ట్ చివరిలో లేదా సెప్టెంబర్ మొదటివారంలో విడుదల కావచ్చు.

Xiaomi 14T Pro లీకైన స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే Redmi K70 Ultra ట్వీక్డ్ వెర్షన్ అని పేర్కొంటొంది. ఇది ఈ నెలాఖరులో చైనాలో లాంచ్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 14T Pro ఫోన్‌లో K70 అల్ట్రా కంటే మెరుగైన కెమెరాల సెటప్ ఉంటుంది. 14T Pro కెమెరా FV-5 టేడా ప్రకారం వెనుకవైపు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది.

Also Read: ఐక్యూ నుంచి నయా ఫోన్.. ధర ఇంత తక్కువ.. మతిపోతుంది!

Xiaomi 14T Pro OLED ప్యానెల్ 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్‌‌తో వస్తుంది. ఇది డైమెన్సిటీ 9300+ చిప్‌సెట్ కలిగి ఉంటుంది. పవర్ కోసం 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీతో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే 16GB వరకు LPDDR5x RAM, 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో రావచ్చు. ఇంకా ఇది మెటాలిక్ ఫ్రేమ్, IP68-రేటెడ్ ఛాసిస్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News