Big Stories

Vivo Budget 5G Phone: వివో బడ్జెట్ 5G ఫోన్.. దీన్ని కొట్టేదేలేదు.. తక్కువ ధరకు దుమ్ములేపుతుంది

Vivo Budget 5G Phone: Vivo దేశంలో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ రాబోయే Vivo Y58 5G స్మార్ట్‌ఫోన్ గురించిన కొన్ని స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం వాచ్ డిజైన్‌తో Vivo Y56కి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా వచ్చే అవకాశం ఉంది. అలానే ఫోన్ Vivo Y58 ఇప్పటికే BIS సర్టిఫికేషన్ పొందింది. అయితే ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఎటువంటి ఫీచర్లు ఉంటాయో చూద్దాం.

- Advertisement -

Vivo నుంచి దేశీయ టెక్ మార్కెట్‌లో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రానుంది. Vivo భారతదేశంలో కొత్త బడ్జెట్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. రాబోయే Vivo Y58 5G ఫోన్ అనేక కీలక ఫీచర్లతో రాబోతోంది. కొన్ని లీక్స్ ప్రకారం Vivo Y58 స్మార్ట్‌ఫోన్ ఈ నెలాఖరు నాటికి దేశంలో లాంచ్ అవుతుంది.

- Advertisement -

Also Read: ఎవరూ చెప్పని ఆఫర్లు.. రెండు ఫోన్లపై బిగ్ డిస్కౌంట్స్.. జాక్‌పాట్ కొట్టండి!

Vivo కంపెనీ Y58 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ వివరాలను వెల్లడించింది. Vivo Y58 ఈ నెలాఖరు నాటికి భారతదేశంలో విడుదల కానుంది. అయితే కచ్చితమైన తేదీని ఇంకా తెలియలేదు. మరికొద్ది రోజుల్లో అధికారిక టీజర్లు తీసుకొస్తామని వివో ఇండియా ప్రకటించింది. ఇది బడ్జెట్ సెగ్మెంట్‌లో రానుంది.

Vivo Y58 ఫీచర్లు గురించి చెప్పాలంటే LCD ప్యానెల్‌ సెగ్మెంట్‌లో బ్రెట్నెస్ సన్‌లైట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం వాచ్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. డ్యూయల్-టోన్ రింగ్‌లతో వెనుకవైపు రౌండ్ కెమెరా మాడ్యూల్‌ను చూడవచ్చు. ఫోన్‌ రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంటుంది. Vivo Y58 భారీ 6,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలు కూడా ప్రస్తుతానికి బయటకు రాలేదు.

Also Read: ఇది దొరికితే పండగే.. వివో నుంచి సూపర్ ‌ఫోన్.. ఈసారి మంటలే!

Vivo Y58 ఇటీవల BIS, TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందింది. ఈ ఫోన్ మోడల్ నంబర్ V2355తో వస్తుంది. ఫోన్ హార్డ్‌వేర్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడికాలేదు. ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో లాంచ్ అయిన Vivo Y56 5Gకి సక్సెసర్‌గా వస్తుంది. ఈ ఫోన్ 6.58-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంటుంది. MediaTek డైమెన్సిటీ 700 SoC చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News