Big Stories

Vivo Budget Smartphones: ఎంత చీపు.. వివో రెండు బడ్జెట్ ఫోన్లు.. ఇంకేం కావాలి!

Vivo Budget Smartphones: స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరకే అప్‌డేటెడ్ ఫీచర్లు కూడిన ఫోన్లను వదులుతున్నాయి. దీంతో మొబైల్ ప్రియులు తక్కువ ధరకే మంచి ఫోన్లను తమ సొంతం చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఇటుంవంటి ఇంటరెస్టింట్ న్యూస్ ఒకటి ఇంటర్నెట్‌ల్ హల్‌చల్ చేస్తుంది. స్మార్ట్‌పోన్ కంపెనీ వివో తన బ్రాండ్ నుండి కొత్త Y సిరీస్ ఫోన్లను తీసుకురానుంది.

- Advertisement -

ఇందులో భాగంగా బడ్జెట్ ప్రైస్‌లోనే Vivo Y18t, Vivo Y18i రెండు ఫోన్‌లను పరిచయం చేయనుంది. ఈ ఫోన్‌ల లాంచ్ తేదీని కంపెనీ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే GizmoChina ఈ ఫోన్‌లను IMEI డేటాబేస్‌లో గుర్తించింది. నివేదిక ప్రకారం వివో ఈ ఫోన్లు బడ్జెట్ సెగ్మెంట్‌లో వస్తాయి. రాబోయే Vivo Y18t మోడల్ నంబర్ V2408, Y18i మోడల్ నంబర్ V2414. ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి ఇంకా ఎక్కువ సమాచారం వెల్లడి కాలేదు. అయితే ఈ రెండు ఫోన్‌లు Y18కి సక్సెసర్‌గా రానున్నాయి. ప్రస్తుతానికి Vivo Y18 ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Vivo Y18 ఫీచర్లు, స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. కంపెనీ ఈ ఫోన్‌లో 1612×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56 అంగుళాల HD + LCD డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే 90Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ 4 GB LPDDR4x ర్యామ్‌తో వస్తుంది. దీన్ని మరో 4GB వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ప్రాసెసర్‌గా ఈ Vivo ఫోన్‌లో MediaTek Helio G85 చిప్‌సెట్ ఉంది. ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఈ ఫోన్‌లో LED ఫ్లాష్‌తో కూడిన రెండు కెమెరాలను అందిస్తోంది.

Also Read: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!

వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్‌తో కూడిన VGA సెన్సార్ ఉంటుంది. సెల్ఫీ కోసం కంపెనీ 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్‌ను అందిస్తోంది. ఫోన్‌లో తీసుకొచ్చిన బ్యాటరీ 5000mAh. ఇది 15 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. Vivo ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారిత Funtouch OS 14లో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం కంపెనీ ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తోంది. కనెక్టివిటీ కోసం ఫోన్‌లో డ్యూయల్ సిమ్, 4 జి, వై-ఫై, బ్లూటూత్ 5.0, జిపిఎస్, యుఎస్‌బి 2.0 వంటి ఆప్షన్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News