Big Stories

Vivo X200 Pro: వివో నుంచి మరో కొత్త ఫోన్.. బెంబేలేత్తిస్తున్న ఫీచర్లు!

Vivo X200 Pro Specifications Leaked: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పుడు Vivo ఫ్లాగ్‌షిప్ X లైనప్.. త్వరలో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే Vivo X200 Pro స్మార్ట్‌ఫోన్. Vivo X200 Pro 1.5K రిజల్యూషన్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. Vivo X200 Pro వనిల్లా Vivo X200తో పాటు ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఇది Vivo X100 Proపై అప్‌గ్రేడ్‌లతో వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Vivo X200 Pro Specifications

- Advertisement -

Vivo X200 Pro 1.5K రిజల్యూషన్, కర్వడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తాజాగా ఓ టిప్‌స్టార్ తెలిపాడు. టిప్‌స్టర్ ప్రకారం.. ఈ మొబైల్ డిస్‌ప్లే 6.7 లేదా 6.8 అంగుళాలు ఉండే అవకాశం ఉందని పేర్కొన్నాడు. Vivo X200 Pro సింగిల్-పాయింట్ అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. ఇది 6,000mAh బ్యాటరీ ప్యాక్‌తో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది పెరిస్కోప్ లెన్స్‌తో సహా కొత్త ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. Vivo X200 Proలో మీడియాటెక్ డైమెన్సిటీ 9400 చిప్‌సెట్ ఉంటుందని చెబుతున్నారు.

భారతదేశంలో Vivo X100 Pro ధర విషయానికొస్తే.. Vivo X100 Pro కంటే Vivo X200 Pro ధర అధికంగా ఉంటుందని చెప్పబడింది. కానీ ఎంతనేది తెలియలేదు. త్వరలో ఈ ఫోన్ లాంచ్, ధర, ఇతర స్పెసిఫికేషన్ వివరాలు వెల్లడికానున్నాయి. ఇక ఇప్పుడు దీని ముందు మోడల్ Vivo X100 Pro గురించి మాట్లాడుకుంటే..

Also Read: ఆఫర్ల సందడి.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. అదిరింది బాబాయ్!

ఇది MediaTek డైమెన్సిటీ 9300 SoCపై నడుస్తుంది. వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP68-రేటెడ్ బిల్డ్‌ను కలిగి ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX989 1-అంగుళాల కలర్ సెన్సార్‌తో కూడిన Zeiss-బ్రాండెడ్ ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఫోన్‌లో Vivo ఇన్-హౌస్ ఇమేజింగ్ చిప్ ఉంది. Vivo X100 Pro మొబైల్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్‌డ్ 6.78-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 100W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,400mAh బ్యాటరీని కలిగి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News