Big Stories

Vivo V40 Pro Launch: అదరగొట్టారు గురూ.. వివో నుంచి సరికొత్త ఫోన్.. ఇది మనలాంటి వారి కోసమే..!

Vivo V40 Pro Launch: స్మార్ట్‌ఫోన్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో Vivo త్వరలో Vivo V40 Pro ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ రాబోయే Vivo ఫోన్ గత నెలలో చైనాలో లాంచ్ అయిన Vivo S19 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చు. లిస్టింగ్ ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల కానుంది. ఫోన్ V2347 మోడల్ నంబర్‌తో రావచ్చని సమాచారం. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

Vivo V40 Pro ఇటీవల థాయ్‌లాండ్‌లోని సర్టిఫికేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన NBTCలో గుర్తించబడింది. దీని గ్లోబల్ విడుదల త్వరలో ఉంటుందని లిస్ట్ సూచిస్తుంది. ఇది మోడల్ నంబర్ V2347తో ఆన్‌లైన్ డేటాబేస్‌లలో కనిపించింది. లిస్ట్ ప్రకారం దాని V40 ప్రో స్పెసిఫికేషన్లు కూడా ధృవీకరించింది. అయితే లిస్టింగ్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ధరతో సహా ఇతర ఎటువంటి వివరాలను వెల్లడించలేదు. ఇది Vivo S19 ప్రో రీబ్రాండెడ్ వెర్షన్‌ అయితే రాబోయే ఫోన్ చైనీస్ మోడల్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

Also Read: భలే ఆఫర్.. చీప్‌‌గా 100MP కెమెరా ఫోన్.. ఫ్రీగా స్మార్ట్‌వాచ్ కూడా.. ఇక తగ్గొద్దు!

Vivo S19 Pro చైనీస్ మోడల్ స్పెసిఫికేషన్ల గురించి చెప్పాలంటే ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది.  ఇది MediaTek డైమెన్సిటీ 9200+ SoCపై రన్ అవుతుంది. ఫోన్ 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో పవర్ కోసం 5,500mAh బ్యాటరీ ఉంటుంది. ఇందులో 80W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ ఉంది.

Vivo S19 Pro స్మార్ట్‌ఫోన్‌లో బ్యాక్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2x ఆప్టికల్ జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

Also Read: మామూలు ఆఫర్ కాదు సామీ.. ఫోన్‌పై వేలల్లో డిస్కౌంట్.. కొన్ని గంటలే ఛాన్స్!

Vivo S19 Pro ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెంట్ కోసం IP69 రేట్‌తో వస్తోంది. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌తో సహా అనేక కనెక్టివిటీ ఆప్షన్లు ఉంటాయా. హ్యాండ్‌సెట్ Android 14 OS ఆధారిత OriginOS 4 కస్టమ్ స్కిన్‌పై రన్ అవుతుంది. ఈ ఫోన్ ధర, లాంచ్ తేది వివరాలు వెల్లడి కాలేదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News