Big Stories

Vivo Y28s 5G Launch: ఇది దొరికితే పండగే.. వివో నుంచి సూపర్ ‌ఫోన్.. ఈసారి మంటలే!

Vivo Y28s 5G Launch: టెక్ మేకర్ వివో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తోంది. అంతే కాకుండా Vivo తన Y-సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ను తీసుకురానుంది. వివో Y28s 5G కొత్త అప్‌డేట్‌తో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది త్వరలో మార్కెట్లోకి రానుంది. దీనికి సంబంధించి స్మార్ట్‌ఫోన్ Vivo సాఫ్ట్‌వేర్ కోడ్‌లో మోడల్ నంబర్ V2346తో లిస్ట్ అయింది. అయితే ఇప్పుడు తాజాగా స్మార్ట్‌ఫోన్  బెంచ్‌మార్కింగ్ సైట్ గీక్‌బెంచ్‌లో కనిపించింది. ఇది దాని స్పెసిఫికేషన్‌లను వెల్లడించింది. దీని ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Vivo రాబోయే స్మార్ట్‌ఫోన్ Vivo Y28s 5G, V2346 మోడల్ నంబర్‌తో వస్తుంది. గీక్‌బెంచ్ 6.3.0 బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో సింగిల్-కోర్ కోసం 599, మల్టీ కోర్ కోసం 1707 స్కోర్ చేసింది. ఈ స్కోర్‌లు ఫోన్‌లో ఆక్టా-కోర్ ప్రాసెసర్, Mali G57 GPUతో రావచ్చని సూచిస్తున్నాయి. ఇది MediaTek డైమెన్సిటీ 6300 లేదా 6080 చిప్‌సెట్ కావచ్చు.

- Advertisement -

Also Read: మళ్లీ వచ్చేశాడు రా బాబు.. HTC రీ ఎంట్రీ.. ఈసారి హిట్ పక్కా!

అదనంగా బెంచ్‌మార్క్ లిస్టింగ్ Vivo Y28s ఫోన్ 8 GB RAMతో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుందిని సూచిస్తుంది. ఈ వివరాలతో పాటు స్మార్ట్‌ఫోన్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్  సర్టిఫికేషన్‌ను కూడా పొందింది. దీని ద్వారా ఫోన్ త్వరలోనే విడుదల కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశం కాకుండా ఇతర మార్కెట్లలో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.

చైనా CQC సర్టిఫైడ్ వెబ్‌సైట్‌లోని లీక్‌లు ఆధారంగా దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లు వెల్లడికాలేదు. Y28e ఫోన్‌లో ఉన్న ఫీచర్ల కోసం మనం ఇప్పటికే మార్కెట్లో లాంచ్ చేసిన Vivo Y28ని చూడవచ్చు.

వివో Y28 5G మీడియాటెక్ డైమెన్సిటీ 6020 SoC ద్వారా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. HD+ రిజల్యూషన్, 90Hz రిఫ్రెష్ రేట్. వాటర్ డ్రాప్ నాచ్‌తో 6.56-అంగుళాల IPS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. USB టైప్-C ద్వారా 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది FunTouch OS 13 కస్టమ్ స్కిన్‌తో Android 13లో రన్ అవుతుంది.

Also Read: వన్‌ప్లస్ షాకింగ్ డీల్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వదిలిపెట్టలేరు!

వివో Y28 5Gలో కెమెరా సెటప్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ ఉన్నాయి. 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అదనపు ఫీచర్లలో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్ కనెక్టివిటీ, బ్లూటూత్ 5.1, IP54 రేటింగ్ ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News