Big Stories

Vivo New Mobiles Launch: ఫోన్ల పండగ.. వివో నుంచి 5G ఫోన్లు.. ఈసారి మతిపోగొట్టారు!

Vivo New Mobiles Launch: టెక్ దిగ్గజ కంపెనీ వివో ఇప్పుడు తన బ్రాండ్ నుంచి Vivo V40 సిరీస్‌ను ఇండియాలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవల సిరీస్ రెండు ఫోన్లు పలు వెబ్‌సైట్లలో కనిపించాయి. Vivo V40e IMEI డేటాబేస్‌లో, Vivo V40 BIS లిస్ట్‌లో గుర్తించబడ్డాయి. దీని ద్వారా ఈ రెండు ఫోన్లు త్వరలోనే భారత్‌లో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో విడుదల చేసిన Vivo V30 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు సక్సెసర్‌గా వీటిని మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. Vivo V40, V40e లలో ప్రత్యేకత ఏమిటి, ఫీచర్లు, తదితర వివరాలను చూద్దాం.

- Advertisement -

Vivo V40e 5G IMEI లిస్టింగ్‌లో గుర్తించబడింది, Gizmochina తన నివేదికలో Vivo V40e 5G IMEI డేటాబేస్‌లో V2418 మోడల్ నంబర్‌తో లిస్ట్ అయినట్లు వెల్లడించింది. జాబితా మోడల్ నంబర్ తప్ప మరేమీ వెల్లడించేదు. ఇది కంపెనీ త్వరలో Vivo V40e 5Gని ప్రారంభించవచ్చని సూచిస్తుంది. వివో V40 5G BIS, V40e రెండు కాకుండా Vivo V40 సిరీస్ మరొక మోడల్‌ను తీసుకురావచ్చు.

- Advertisement -

Also Read: ఎంత చీపు.. వివో రెండు బడ్జెట్ ఫోన్లు.. ఇంకేం కావాలి!

ఈ మేరకు మోడల్ నంబర్ V2348తో Vivo V40 జూన్ 21, 2024న భారతీయ BIS డేటాబేస్‌లో గుర్తించారు. Vivo V40, V40 Lite ఇటీవలే తమ గ్లోబల్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చాయి.Vivo V40 5G స్పెసిఫికేషన్‌లు గ్లోబల్ వేరియంట్ ప్రకారం BIS లిస్టింగ్ ఎటువంటి హార్డ్‌వేర్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించలేదు. Vivo V40 ఇండియా వెర్షన్ దాని గ్లోబల్ వేరియంట్‌కు సమానమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది.

Vivo V40 గ్లోబల్ మోడల్ 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్, 120 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్‌ ఉంటుంది. ఇందులో 12GB RAM +512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. మైక్రో SD కార్డ్‌తో దీని స్టోరేజీని పెంచుకోవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి.

Also Read: లడ్డూ కావాలా నాయనా.. ఐఫోన్లపై మైండ్ బ్లోయింగ్ డీల్స్.. అదా ఇదా!

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ IP68 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో వస్తుంది. ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5500 mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కంపెనీ గ్లోబల్ వేరియంట్ బాక్స్ నుండి ఛార్జర్‌ను తీసివేసింది. అయితే చైనాలో ఇది ఛార్జర్‌తో సేల్‌కి తీసుకొచ్చారు. ఇప్పుడు Vivo భారతదేశంలో ఛార్జర్‌తో తీసుకువస్తుందా లేదా అనేది చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News