Big Stories

Vivo V30-V30 Pro: త్వరలో మార్కెట్లోకి వివో వి30 అండ్ వివో వి30 ప్రో.. ధర, స్పెషిఫికేషన్స్ ఇవే

- Advertisement -

Vivo V30-V30 Pro: ప్రస్తుతం ప్రపంచమంతటా 5జీ నెట్‌వర్క్ వ్యాపించి ఉంది. అందువల్ల మొబైల్ వినియోగదారులు ఇప్పుడు 4జీ నుంచి 5జీకి కనెక్ట్ అవుతున్నారు. ఇక వాటికి అనుగుణంగానే ప్రస్తుతం మార్కెట్‌లోకి 5జీ నెట్‌వర్క్‌తో పలు బ్రాండెడ్ కంపెనీల స్మార్ట్‌ఫోన్లు దర్శనమిస్తున్నాయి.

- Advertisement -

ఇప్పటికే ఎన్నో కంపెనీలు తమ మోడల్‌లోని 5జీ నెట్‌వర్క్‌తో మొబైళ్లను రిలీజ్ చేశాయి. తాజాగా మరో బ్రాండెడ్ కంపెనీ తమ మోడల్‌లోని మరో సిరీస్‌ను తీసుకు రావడానికి సిద్ధంగా ఉంది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వివో తన V సిరీస్‌లోని రెండు ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది.

వివో వి 30 (Vivo V30), వివో వి 30 ప్రో (V30 Pro) ఫోన్లను భారత మార్కెట్‌లోకి త్వరలో (మార్చి)లో తీసుకురానుంది. ఈ వి సిరీస్ ఫోన్లు మూడు కలర్ ఆప్షన్లలో లభించనున్నట్లు తెలుస్తోంది. అండమాన్ బ్లూ, క్లాసిక్ బ్లాక్, పికాక్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో ఇది వస్తుంది. ఈ ఫోన్లను ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

Read More: ఒప్పో నుంచి మరో మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర తక్కువ.. అదిరిపోయిన ఫీచర్లు..!

Vivo V సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 1260 x 2800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిస్ప్లే పంచ్-హోల్ డిజైన్, 120Hz రిఫ్రెష్ రేట్, గరిష్టంగా 2800 నిట్‌ల కాంతిని కలిగి ఉంటుందని అనుకుంటున్నారు. అదనంగా, ఇది HDR10+కి మద్దతు ఇవ్వవచ్చునని సమాచారం. అంతేకాకుండా ఇది ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో రావచ్చుని చెబుతున్నారు.

ఈ రెండు ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు అంచనా. V30 ప్రో 50-మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. సెల్ఫీల కోసం 50-మెగా పిక్సెల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. వివో వి 30 ప్రో MediaTek Dimensity 8200 ప్రాసెసర్‌తో 12GB వరకు RAM, 512GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందించబడుతుందని సమాచారం వినిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 SoCని కలిగి ఉంటుందని భావిస్తున్నారు.

Read More: 50MP కెమెరా, 11GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.6,499లకే.. ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు..!

రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటాయి. 80W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. అయితే దీని ధర విషయానికి వచ్చే సరికి ఇది దాదాపు రూ.33,990ల ధరతో మార్కెట్‌లోకి వచ్చే అవకాశముందని అంతా భావిస్తున్నారు. మరి వీటి గురించి అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వేచి చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News