Big Stories

Vivo V40E 5G Features Leaked: ఏముంది దొర.. వివో నుంచి కొత్త 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్స్..!

Vivo V40e 5G Features Leaked before Launching in India: స్మార్ట్‌ఫోన్ వాడకం దేశంలో ఊహించని స్థాయిలో పెరుగుతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం అమెరికా, చైనా తర్వాత భారత్‌లోనే స్మార్ట్‌ఫోన్ల వినియోగం అధికంగా ఉంది. ఈ క్రమంలోనే అన్ని కంపెనీలు గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసిన అనంతరం భారత్‌లోకి తీసుకొస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ Vivo ఎప్పటికప్పుడు సరికొత్త మోడల్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. కంపెనీ ఇప్పుడు Vivo V40 సిరీస్‌‌ను పరిచయం చేయనుంది. ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్ Vivo V40e 5G IMEI డేటాబేస్‌లో కనిపించింది. ఇటీవల Vivo V40 Lite బ్లూటూత్ SIG, GCF సర్టిఫికేషన్‌లో లిస్ట్ అయింది. ఇది కాకుండా టిప్‌స్టర్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లను వెల్లడించారు. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Vivo V40e 5G Features
Gizmochina ప్రకారం.. Vivo V40 సిరీస్ ఇటీవల విడుదలైన Vivo V40తో సమానంగా ఉంటుంది. Vivo ఎగ్జిక్యూటివ్ చెప్పినట్లుగా Vivo V40 అప్‌డేటెడ్ ఫీచర్లతో వస్తుంది. ఇప్పుడు ఈ సిరీస్ Vivo V40e 5Gతో విస్తరిస్తోంది. Vivo V40e 5G మోడల్ నంబర్ V2418తో గుర్తించారు. ఇది 5G స్మార్ట్‌ఫోన్. అయితే Vivo V40e 5G గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం అందుబాటులో లేదు.

- Advertisement -

Vivo V40e 4Gతో పోలిస్తే Vivo V40e 5G లేటెస్ట్ ఫీచర్లతో వస్తుంది. Vivo V40e 5G అధికారిక లాంచ్ తేదీని ఇంకా కంపెనీ వెల్లడించలేదు. అయితే వివో ఈ కొత్త మోడల్ నంబర్‌పై టెక్ వర్గాల్లో అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. Vivo V40 సిరీస్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే Vivo V40e 5G కూడా మంచి సేల్స్ నమోదు చేస్తుందని కంపెనీ భావిస్తోంది.

Also Read: అన్నీ గాల్లోనే.. ఫోన్‌పై రూ.4 వేల డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు!

Vivo V30e 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని రిజల్యూషన్ 2400 × 1080 పిక్సెల్‌లు, రిఫ్రెష్ రేట్ 120Hz, 1300 నిట్‌ల వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. Vivo V30e Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్‌‌పై వస్తుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, వెనుక భాగంలో 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News