Big Stories

Vivo T3 Lite 5G: వివో నుంచి బడ్జెట్ ఫోన్..ఫీచర్స్ అదుర్స్

New Phone Vivo T3 Lite 5G Features: ప్రముఖ కంపెనీ వివో నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ రానుంది. ఈ నయా ఫోన్‌ను భారత్‌ మార్కెట్‌లోకి విడుదల చేయనుంది. Vivo T3 Lite 5G ఫోన్‌ను త్వరలో ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌ను జూన్ చివరి నాటికి రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో వివో టీ3 5జీ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ విడుదల చేసిన కొద్ది రోజులకే మరో ఫోన్ విడుదల చేయడంతో మొబైల్స్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -

భారత్ మార్కెట్‌లో వివో సంస్థ పోటాపోటీగా నయా ఫోన్లను విడుదల చేస్తుంది. ముఖ్యంగా రియల్ మీ నార్జో ఎన్65 5జీ, రియల్ మీ సీ65 5జీ ఫోన్లకు ధీటుగా వివో టీ3 5జీ ఫోన్ రానున్నట్లు భావిస్తున్నారు. వివో టీ3 లైట్ 5జీ ధర రూ.11,999 ఉండొచ్చని సమాచారం.

- Advertisement -

ఫీచర్లు ఇవే..
వివో టీ3 లైట్ 5జీ ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పాటు ఏఐ బ్యాక్డ్ 50 మెగా పిక్సెల్ సోనా ప్రైమరీ సెన్సర్ కెమెరా, సెకండరీ కెమెరా ఉంటాయని తెలుస్తోంది. ఈ ఫోన్ రెండు రంగుల్లో రానున్నట్లు తెలుస్తోంది.

వివో టీ3 5జీ ఫోన్ డిజైన్ మాదిరిగానే వివో టీ3 లైట్ 5జీ ఫోన్ ఉంటుందని తెలుస్తోంది. కాగా, వివో టీ3 5జీ ఫోన్ కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 ఉండగా.. 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.21,999గా ఉంది.

మరోవైపు వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ ఇటీవల మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ కు తర్వాతి వెర్షన్‌గా వివో టీ3 లైట్ 5జీ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో వివో చాలా అప్ గ్రేడ్స్ చేసింది. సమాచారం ప్రకారం.. బడ్జెన్ ఫోన్ అందుబాటులో ఉండేలా తక్కువ ధరలో అందించనుంది.

Also Read:  ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. మీ డ్రీమ్ నిజం చేస్కోండి.. మరీ ఇంత తక్కువకా!

వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్..మీడియా 7200 ఎస్వోసీ చిప్ సెట్, 44 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ ఉండడంతోపాటు 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంది. అలాగే 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ, అమోలెడ్ స్క్రీన్ , 50 మెగా పిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్, సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ప్రత్యేకంగా 16 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.

వివో టీ3 5జీ స్మార్ట్ ఫోన్ యొక్క క్లాస్ లీడింగ్ పనితీరును శక్తివంత చేయడం కోసం ప్రత్యేకంగా ప్రాసెసర్ అమర్చారు. దీంతో పనితీరు, సామర్థ్యం మధ్య ఖచ్చితమైన సమతుల్యతను అందిస్తుంది. అధిక పనితీరు గల కోర్‌లు ఉన్నతమైన మల్టీ టాస్కింగ్, పీక్ పవర్‌ను ఎనేబుల్ చేస్తాయి. ఈ కెపాసిటీలతో బ్యాటరీ ఎక్కువగా కాలం రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News