Big Stories

Vivo New Smartphone: బెండు తీసిన వివో.. కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ఆట మొదలైంది!

Vivo New Smartphone: చైనీస్ టెక్ మేకర్ వివో పవర్‌ఫుల్ బ్యాటరీతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ Vivo V40ని విడుదల చేసింది. ఇందులో 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ బాక్స్‌లో ఛార్జర్‌ను కంపెనీ ఇవ్వడంలేదు. ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ప్రత్యేక ఛార్జర్‌ కొనాల్సి ఉంటుంది. ముందుగా యాపిల్, సామ్‌సంగ్ బ్రాండ్‌లు మాత్రమే బాక్స్‌తో ఛార్జర్లను ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చైనా కంపెనీలు కూడా అదే బాటలో ఉన్నాయి.ఆపిల్ బాక్స్ నుండి ఛార్జర్‌ను తీసివేసిన తర్వాత సామ్‌సంగ్ దాని ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ల నుంచి ఛార్జర్‌ను తీసివేసింది. అయితే ఈ వివో ఫోన్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? ధర తదితర వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

Vivo V40 స్మార్ట్‌ఫోన్ Vivo S19లో ఉండే స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ని సపోర్ట్ చేస్తుంది. కానీ దాని చైనీస్ మోడల్‌లో ఛార్జర్ ఉంది. అయితే గ్లోబల్ వేరియంట్‌లో ఛార్జర్ తీసేశారు. అంతే కాకుండా గ్లోబల్ వెర్షన్ (8GB+256GB) బేస్ వేరియంట్‌లో బ్యాక్ కేసు ఉండదు. అయితే 12GB+512GB మోడల్‌లో ఒక కేస్ ఉంటుంది. చైనీస్ వేరియంట్ కంటే గ్లోబల్ వేరియంట్ 500mAh తక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read: నాన్నకు ప్రేమతో.. బెస్ట్ చీపెస్ట్ మొబైల్ గిఫ్ట్స్.. ప్రేమను రెట్టింపు చేద్దాం!

Vivo V40  ఐరోపాలో విడుదల చేశారు. కానీ బాక్స్‌లో ఛార్జర్ ఇవ్వలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది LPDDR4X RAM +UFS 2.2 స్టోరేజ్ యూనిట్‌తో వస్తుంది. ఇది రెండు కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. అందులో 8GB+256GB , 12GB+512GB వేరియంట్లు ఉన్నాయి.

Vivo V40 ఫోన్ 1.5K రిజల్యూషన్ (2800 x 1260)తో 6.78-అంగుళాల 120 Hz AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది రెండు కలర్ వేరియంట్‌లో లభిస్తుంది. స్టెల్లా సిల్వర్, నెబ్యులా పర్పుల్. డ్యూయల్-కెమెరా సెటప్‌లో 50MP f/1.9 మెయిన్ కెమెరా, 50MP f/2.0 అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా ఉన్నాయి.

Also Read: వర్షాకాలం ఫోన్.. అతి తక్కువ ధరకే.. దీన్ని కొట్టేదేలేదు!

Vivo V40 5G స్మార్ట్‌ఫోన్ e-SIMకి సపోర్ట్ ఇస్తుంది.  USB 2.0 స్టాండర్డ్ ఛార్జింగ్ పోర్ట్‌ను కలిగి ఉంది. TheTechOutlook ప్రకారం ఫోన్ బేస్ వేరియంట్ ధర €599 (సుమారు రూ. 53,637). ఈ ఫోన్ జూలైలో  యూరప్‌ మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News