Big Stories

Tiktok App : డౌన్‌లోడ్లలో టిక్‌టాక్ టాప్

Tiktok App

Tiktok App : ఇప్పుడీ టెక్ యుగంలో మొబైల్ యాప్‌లు మన దైనందిన జీవితాల్లో ఓ భాగమైపోయాయి. రోజువారీ పనులతో పాటు వినోదం, అనుసంధానతల్లో ఎనలేని మార్పులు తీసుకొచ్చి.. ప్రాచుర్యం పొందిన యాప్‌లెన్నో ఉన్నాయి.

- Advertisement -

రోజురోజుకీ మారిపోతున్న డిజిటల్ ప్రపంచంలో కొత్త కొత్త యాప్‌లు కూడా ఎన్నెన్నో వస్తున్నాయి. నిరుడు అత్యధిక డౌన్‌లోడ్లు జరిగిన టాప్ టెన్ యాప్‌లు ఏవో చూద్దామా? 2022లో టిక్ టాక్ అత్యంత జనాదరణ పొందింది.

- Advertisement -

ఎంటర్టైన్మెంట్ కోసం 672 మిలియన్ల మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇండియా సహా 12 దేశాల్లో ఈ యాప్‌ను నిషేధించారు. ఇక సోషల్ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టా‌గ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌లకు ఆదరణ అందరికీ తెలిసిందే.

ఇన్‌స్టా‌గ్రామ్ 547 మిలియన్లు, ఫేస్‌బుక్ 449 మిలియన్లు, వాట్సాప్ 424 మిలియన్లు, టెలిగ్రామ్ 310 మిలియన్ల డౌన్‌లోడ్లు జరిగాయి. గేమ్స్ రంగంలో సబ్‌వే సర్ఫర్స్‌ను 304 మిలియన్ల మంది, స్టంబుల్ గైస్‌ను 254 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.

మ్యూజిక్ ప్రియులకూ బోలెడు యాప్‌లు‌న్నాయి. అత్యధికంగా 238 మిలియన్ల మంది స్పోటిఫైని ఆదరిస్తున్నారు. షాపింగ్ విషయానికొస్తే షియెన్ యాప్‌ను 229 మిలియన్ల మంది వినియోగిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News