Big Stories

Smart Shoes: ఫోన్‌ను ఛార్జ్ చేయగల స్మార్ట్ షూస్..

Smart Shoes: చదువు అనేది జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. అప్పుడు కొత్త కొత్త విషయాలు ఎన్ని అయినా కనుక్కోవచ్చు అని కొందరు చెప్తుంటారు. కానీ ఈరోజుల్లో అలా కాదు.. ఎన్నో పెద్ద డిగ్రీలు సంపాదించినా కూడా సాధించలేని కొన్ని విషయాలను స్కూల్ విద్యార్థులు సాధించి చూపిస్తున్నారు. టెక్నాలజీని వినియోగిస్తూ.. యూట్యూబ్ చూస్తూ కొత్త విషయాలను నేర్చుకోవడమే కాదు.. తయారు చేస్తున్నారు కూడా. అలా 9వ తరగతి విద్యార్థి ఇన్నోవేషన్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

- Advertisement -

ఇప్పటికే పెరిగిన టెక్నాలజీ కారణంగా ఎన్నో ఎన్నో కొత్త పరికరాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కానీ అందులో ఎన్ని పరికరాలు మానవాళికి పూర్తిగా ఉపయోగపడుతున్నాయి అన్నదే ప్రశ్న. అందుకే చాలామందికి ఉపయోగపడడం కోసం బెంగాల్‌లోని హూఘ్లీ జిల్లాకు చెందిన సౌవిక్ సేథ్.. స్మార్ట్ షూలను తయారు చేశాడు. ఈ స్మార్ట్ షూల వల్ల ఒకటి కాదు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవన్నీ చూసి నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈ కుర్రాడి తెలివిని ప్రశంసిస్తున్నారు.

- Advertisement -

సౌవిక్ తయారు చేసిన స్మార్ట్ షూలలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌తో పాటు కెమెరాలు కూడా పొందుపరిచాడు. అంతే కాకుండా వీటి ద్వారా సెల్‌ఫోన్స్ కూడా ఛార్జ్ అవుతాయని స్వయంగా ప్రకటించాడు. ఈ స్మార్ట్ షూలు ధరించి నడిచినప్పుడు ఇందులో నుండి కరెంటు వెలువడుతుందని, దాని వల్ల ఫోన్స్ ఛార్జ్ అవుతాయని అన్నాడు. సౌవిక్ ఎప్పుడూ కొత్త కొత్త విషయాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడని, ఇది తనకు చిన్నప్పటి నుండి అలవాటే అని తన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

సౌవిక్ మాత్రమే కాదు.. తనలాంటి విద్యార్థులు ఎంతోమంది కొత్త కొత్త వస్తువులను తయారు చేయాలని ఆసక్తితో ఉంటారు. కానీ సరైన వనరులు లేక, లేదా సరైనా ప్రోత్సాహం లేక ఆగిపోతున్నారు. కొందరు మాత్రం ఏం జరిగినా.. తమ ఇన్నోవేషన్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని అనుకుంటున్నారు. అలాంటి వారికి ప్రభుత్వం తరపున కూడా ప్రోత్సాహం దొరకాలని శాస్త్రవేత్తలు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలావరకు శాస్త్రవేత్తలు కూడా ఇలాంటి టాలెంటెడ్ విద్యార్థులను తమ టీమ్‌లలో చేర్చుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News