Big Stories

Vivo V30e 5G Mobile: బంపర్ ఆఫర్.. వివో 5G ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్.. ఏకంగా రూ.2500..

Huge Discount on Vivo V30e 5G Mobile: 5G విప్లవంతో స్మార్ట్‌ఫోన్ల విక్రయం గణనీయంగా పెరిగింది. మార్కెట్‌లోకి కొత్తకొత్త రకాల ఫోన్లను తక్కువ ధరకే అందుబాటులోకి వస్తున్నాయి. అంతే కాకుండా ఇవి లెటెస్ట్ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వివో స్మార్ట్‌‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. మీరు అద్భుతమైన కెమెరా పనితీరుతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్‌లో Vivo V30e ఫోన్ 8 GB RAM + 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 27,999కి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

- Advertisement -

అయితే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై ఉన్న ఆఫర్‌లను ఉపయోగించడం ద్వారా ఫోన్‌పై రూ.2500 డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ. 25,499గా ఉంటుంది. ఇది కాకుండా మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఇది మాత్రమే కాదు కావాలంటే మీరు ఈ ఫోన్‌ను EMI ఎంపికతో కూడా కొనుగోలు చేయవచ్చు.  ఫ్లిప్‌కార్ట్ ఈ పరికరంపై రూ.25,500 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ పాత ఫోన్ పర్ఫామెన్స్, మీ ఏరియా పిన్‌కోడ్‌పై ఆధారపడి ఉంటుంది. Vivo ఈ ఫోన్ వెల్వెట్ రెడ్, సిల్క్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుంది.

- Advertisement -

Also Read: బడ్జెట్ వార్.. తక్కువ ధరకే రెండు ఫోన్లు లాంచ్.. అవాక్కవుతారు!

Vivo V30eస్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 1080 x 2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఫుల్ HD + 3D కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది.  ఇది 1300 nits పీక్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. ఫోన్ Snapdragon 6 Gen 1 చిప్‌సెట్‌‌‌తో వస్తుంది. ఇందులో 8GB రియల్ 8GB వర్చువల్ RAM ఉంటుంది. ఇది 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

కెమెరా గురించి మాట్లాడితే ఫోటోగ్రఫీ కోసం మీరు ఈ ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను చూస్తారు. ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తుంది. ఇది అద్భుతమైన సెల్ఫీని క్యాప్చర్ చేయగలదు.

Also Read: బిగ్ అప్‌డేట్.. ఐఫోన్ 16 ప్లస్ ధర, ఫీచర్లు లీక్.. ఏముంది రా నాయనా!

Vivo V30e స్మార్ట్‌ఫోన్ 5500mAh బ్యాటరీతో వస్తుంది. దీనిని 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఛార్జ్ చేయవచ్చు. ఈ హ్యాండ్‌సెట్ Android 14 ఆధారంగా Funtouch OS 14లో రన్ అవుతుంది. ఈ ఫోన్‌తో నాలుగేళ్ల పాటు మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ వెల్లడించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News