Big Stories

Infinix Note 40S Launch: మనకు ఇది చాలు అన్నయ్య.. బట్జెట్ ధరకే ప్రీమియం స్మార్ట్‌ఫోన్!

Infinix Note 40S Launch: Infinix స్మార్ట్‌ఫోన్ కంపెనీ తన నోట్ 40 సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది. ఈ సిరీస్‌లో Infinix Note 40S విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఫోన్ ముఖ్యమైన కన్ఫర్మేషన్‌లో కనిపించింది. ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇది డిస్‌ప్లే‌లో పంచ్ హోల్ కటౌట్ డిజైన్‌ను కలిగి ఉంది. MediaTek MT6789 చిప్‌సెట్ ఫోన్‌లో చూడొచ్చు. అంతే కాకుండా అనేక ప్రీమియం స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

- Advertisement -

Infinix Note 40 సిరీస్‌ కొత్త ఎడిషన్‌ను చాలా త్వరగా తీసుకురావచ్చు. కంపెనీ ఈ సిరీస్ రాబోయే స్మార్ట్‌ఫోన్ Google Play కన్సోల్ లిస్టింగ్‌లో ఉంది. ఈ ఫోన్ Infinix Note 40S. ఫోన్ మోడల్ నంబర్ X6850B లిస్టింగ్‌లో నమోదైంది. దాని రెండర్ కూడా ఇక్కడ ఉన్నాయి. దీని ప్రకారం ఫోన్  ప్యానెల్‌లో పంచ్‌హోల్ కటౌట్ ఉంటుంది. అందులో సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో రాబోతోంది.

- Advertisement -

Also Read: ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. ఇక రచ్చ రచ్చే!

Infinix Note 40S స్పెసిఫికేషన్స్‌లో 1080 x 2436 పిక్సెల్స్ రిజల్యూషన్ కలిగిన డిస్‌ప్లే 480 dpi పిక్సెల్ డెన్సిటీని కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో MediaTek MT6789 చిప్‌సెట్ ఉంటుంది. ఇది కార్టెక్స్-A76  రెండు కోర్‌లను కలిగి ఉంది. ప్రాసెసర్ పేరు గురించి మాట్లాడితే ఇది Helio G99 చిప్‌సెట్‌లో రావచ్చు. గ్రాఫిక్స్ కోసం Mali G57 GPU కూడా ఉంటుంది. ఫోన్‌లో 8 GB RAM ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 OS అవుట్ ఆఫ్ ది బాక్స్‌తో రన్ అవుతుంది. ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

ఇటీవల కంపెనీ ఈ సిరీస్‌లోనే Infinix Note 40 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్ 6.78 ఇంఛెస్ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది FullHD ప్లస్ రిజల్యూషన్‌తో వస్తుంది. దీని బ్రైట్నెస్ 1,300 నిట్‌లు. డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ మద్దతును కలిగి ఉంది. ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7020 ప్రాసెసర్‌ ఉంటుంది. ఫోన్‌లో 12 GB RAM+512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఉంటుంది.

Also Read: సాయిరామ్.. ఒప్పో, రెడ్‌మీ నుంచి కుప్పలు కుప్పలుగా ఫోన్లు.. మెంటల్ ఎక్కిపోద్ది!

Infinix Note 40 5G OIS ఫీచర్‌తో 108MP మెయిన్ లెన్స్ ఫోన్ బ్యాక్ సైడ్ ఉంటుంది. డెప్త్ సెన్సార్, మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. రెండూ 2 మెగాపిక్సెల్ సెన్సార్లు. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 5000 mAh పెద్ద బ్యాటరీ చూడొచ్చు. దానితో పాటు 33W ఫాస్ట్ ఛార్జర్ కూడా అందుబాటులో ఉంది. ఇది కాకుండా  ఇది 15W వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్‌‌కు సపోర్ట్ చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News