Big Stories

Realme Narzo 70 Pro 5G: రియల్‌మీ నార్జో 70 ప్రో ఫోన్‌పై రూ. 4 వేల డిస్కౌంట్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు బ్రో..!

Rs 4,000 Discount on Realme Narzo 70 Pro 5G: టెక్ మార్కెట్‌లో బాగా ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో రియల్‌మీ కూడా ఒకటి. కంపెనీ కొన్ని నెలల క్రితం రియల్‌మీ నార్జో 70 ప్రో 5G మొబైల్‌ని విడుదల చేసింది. దీని బేస్ వేరియంట్ ధర రూ.19,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో టాప్‌ క్లాస్ ఫీచర్లను అందించింది రియల్‌మీ. అయితే ఇప్పుడు ఈ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఫోన్‌లలో AMOLED డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ అమోజాన్‌ ఈ ఫోన్‌పై ఆఫర్ ప్రకటించింది.

- Advertisement -

Realme Narzo 70 Pro 5G రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఇందులో 8GB RAM + 128GB, 8GB RAM + 256GB ఉన్నాయి. దీని బేస్ వేరియంట్ ధర రూ.19,999. అదే సమయంలో దీని టాప్ వేరియంట్ రూ. 21,999. ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ బేస్ వేరియంట్ కొనుగోలుపై రూ. 4,000 కూపన్ డిస్కౌంట్ ఉంది. దాని టాప్ వేరియంట్ కొనుగోలుపై రూ. 3,000 కూపన్ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. డిస్కౌంట్ తర్వాత రూ. 15,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది. ఇది కాకుండా ఫోన్ కొనుగోలుపై రూ.1,500 బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఈ విధంగామీరు ఈ Realme ఫోన్‌ను రూ. 13,499 ప్రారంభ ధరతో ఇంటికి తీసుకురావచ్చు.

- Advertisement -

Also Read: ఇదే సరైన ఆఫర్.. iQOO 5G ఫోన్‌పై బంపర్ డిస్కౌంట్‌!

Realme Narzo 70 Pro 5G Features
ఈ Realme స్మార్ట్‌ఫోన్‌లో 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లే ఉంది. ఫోన్ డిస్‌ప్లే HDR10+, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 2000 నిట్స్‌తో పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7050 5G ప్రాసెసర్ ఉంటుంది. కంపెనీ దీని ముందు మోడల్ Narzo 60 Pro 5G ఫోన్‌లో కూడా ఇదే ప్రాసెసర్‌ని ఉపయోగించింది. రియల్‌మీ నార్జో 70 Pro 5G 8GB ఫిజికల్, 8GB వర్చువల్ RAMని కలిగి ఉంటుంది. దీని ద్వారా ఫోన్ RAMని 16GB వరకు విస్తరించవచ్చు. ఇది కాకుండా ఫోన్‌లో 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.

ఫోన్ బ్యాక్ ట్రిపుల్ కెమెరా యూనిట్ అందుబాటులో ఉంది. ఇందులో 50MP సోనీ IMX890 OIS ప్రైమరీ కెమెరా ఉంటుంది. దానితో పాటు మరో రెండు కెమెరాలను అందించారు. ఈ కెమెరాతో వస్తున్న ఈ సెగ్మెంట్‌లో భారత్‌లో ఇదే తొలి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. 16MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. ఇది కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ ఫీచర్ కలిగి ఉంది. మీరు తడి చేతులతో కూడా ఈ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.

Also Read: iPhone 14 Plus Discount Offer: మిస్ చేయకండి.. సగం ధరకే ఐఫోన్ 14 ప్లస్.. ఇక దండయాత్రే!

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా Realme UI 5.0లో రన్ అవుతుంది. అంతేకాకుండా ఎయిర్ గెస్చర్ ఫీచర్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీని ద్వారా మీరు ఫోన్‌ను తాకకుండా చాలా ఫీచర్లను ఉపయోగించవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 5000mAh బ్యాటరీతో 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో సపోర్ట్‌లో వస్తుంది. IP54 వాటర్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఫోన్‌లో ఉంది. ఈ ఫోన్ గ్లాస్ గ్రీన్, గ్లాస్ గోల్డ్ అనే రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది. కనెక్టవిటీ కోసం WiFi, Bluetooth, USB Type C, Dual 5G SIM కార్డ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఫోన్‌లో ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News