Big Stories

Discount on OnePlus 11 5G: వన్‌ప్లస్ షాకింగ్ డీల్.. ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. వదిలిపెట్టలేరు!

Instant Discount on OnePlus 11 5G Mobile: వన్‌ప్లస్ బ్రాండ్‌కు దేశీయ మార్కెట్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎందుకంటే ఈ కంపెనీ బెస్ట్, ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. తాజాగా వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ ఫోన్ల ధరలను భారీగా తగ్గించింది. దీంతో 100W ఛార్జింగ్‌ సపోర్ట్ ఉన్న OnePlus ఫోన్ చాలా చౌకగా మారింది. కంపెనీ అఫిషియల్ సైట్‌లో షాకింగ్ డీల్‌ను OnePlus 11 5G‌పై అందిస్తోంది. ఫోన్ ధర రూ.45,999. 3,000 తక్షణ తగ్గింపుతో కొనుగోలు చేసే అవకాశాన్ని కంపెనీ కల్పిస్తోంది. ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులు 3 నెలల పాటు YouTube ప్రీమియం ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తుంది. మీరు OnePlus నుండి కొత్త ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటే ఈ ఆఫర్ చాలా ఉపయోగంగా ఉంటుంది.

- Advertisement -

OnePlus 11 5G (8GB+128GB) కంపెనీ వెబ్‌సైట్‌లో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఫోన్ ధర రూ.45,999. అయితే ఇప్పుడు రూ. 3,000 తగ్గింపుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ డిస్కౌంట్ కోసం మీరు ICICI, HDFC, IDFC ఫస్ట్ లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ ఉపయోగించాలి. మీరు ఈ OnePlus ఫోన్‌ని 6 నెలల నో-కాస్ట్ EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను కొనుగోలు చేసే వినియోగదారులకు కంపెనీ 6 నెలల పాటు 100 GB Google One క్లౌడ్ స్టోరేజ్‌ను, 3 నెలల పాటు YouTube ప్రీమియం ఉచితంగా అందిస్తోంది.

- Advertisement -

కంపెనీ ఈ ఫోన్‌లో 3216×1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల QHD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ AMOLED డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. కంపెనీ ఈ ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ని అందిస్తోంది. OnePlus ఈ ఫోన్ 8 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.  ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 చిప్‌సెట్‌ ప్రాసెసర్ ఉంటుంది. ఫోటోల కోసం LED ఫ్లాష్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ తీసుకొచ్చారు.

Also Read: దేశీయ టెక్ దిగ్గజం బిగ్ ట్విస్ట్.. చీపెస్ట్ 5G ఫోన్ లాంచ్.. బడ్జెట్‌లో ఛాంపియన్!

ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 48 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, 32 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌కు సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫోన్ మెయిన్ కెమెరాలో OIS,  EIS సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో 5000mAh బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OS గురించి మాట్లాడితే ఫోన్ Android 13లో ఆక్సిజన్ OSలో రన్ అవుతుంది. సేఫ్టీ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News