Big Stories

OnePlus Nord 3 5G Price Drops: ఆఫర్ల సందడి.. 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. అదిరింది బాబాయ్..!

OnePlus Nord 3 5G Price Drops: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త సందడి మొదలైంది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్ తన బ్రాండ్ ఫోన్లపై భారీ ఆఫర్లు కురిపిస్తోంది. ఈ క్రమంలోనే OnePlus Nord 3 ఫోన్‌ను గత ఏడాది జులైలో ప్రారంభించింది. ఇది లాంచ్ అవగానే భారీగా సేల్స్ నమోదు చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఫోన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. అమెజాన్ మాన్‌సూన్ మొబైల్ మానియా సేల్‌లో రూ. 20,000 కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది.

- Advertisement -

OnePlus Nord 3 5G స్మార్ట్‌ఫోన్ అసలు ధర రూ.33,999గా ఉంది. అమెజాన్ దీనిపై 41 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఫోన్‌ను రూ. 19,998కి కొనుగోలు చేయవచ్చు. అంతే కాకుండా రూ.970తో ప్రారంభ EMIతో కొనుగోలు చేయవచ్చు. జూన్ 25 వరకు కొనుగోలు చేయడానికి కొన్ని బ్యాంకు కార్డులపై కంపెనీ అదనంగా 10 శాతం తగ్గింపును కూడా ఇస్తోంది. ఈ ధరలో OnePlus Nord 3 వేరే వాటితో పోల్చితే చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది.

- Advertisement -

ఇక OnePlus Nord 3 5G విషయానికి వస్తే ఇందులో Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటక్షన్‌తో 6.74-అంగుళాల AMOLED FHD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. ప్యానెల్ 120Hz రిఫ్రెష్ రేట్‌కి సపోర్ట్ ఇస్తుందిద. షోన్‌లో 5,000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. వెనుకవైపు OISతో సోనీ IMX890తో 50MP ప్రైమరీ కెమెరా, సోనీ IMX355 సెన్సార్‌తో కూడిన 8MP అల్ట్రావైడ్ కెమెరా 2MP మాక్రో కెమెరా ఉన్నాయి.

Also Read: మస్త్‌గా ఉంది.. ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్.. ఇది నిజంగా తోపు!

OnePlus Nord 3 5G ఫోన్ 8GB RAM+128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్ ఆండ్రాయిడ్‌పై ఆధారపడి ఉంటుంది. ఫోన్‌ IP54 రేటింగ్‌ సపోర్ట్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్‌లో Wi-Fi 802.11 ax, GPS, USB టైప్-C ఉన్నాయి. ఫోన్‌లోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, కంపాస్/మాగ్నెటోమీటర్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉన్నాయి. అలానే వన్‌ప్లస్ ఇదే ప్రైస్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ OnePlus Nord CE 4 Liteని తీసుకురాబోతుంది. జులై 24న ఈ ఫోన్ విడుదల అవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News