Big Stories

Infinix Note 40 5G Launch: గట్టిగా పట్టెయ్.. కొత్త ఫోన్ లాంచ్.. అమేజింగ్ ఆఫర్లు!

Infinix Note 40 5G Launch: స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇన్ఫినిక్స్ వరుసగా కొత్త ఫోన్లను లాంచ్ చేస్తోంది. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లతో ఫోన్లను విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా భారత దేశంలో జూన్ 21న కొత్త Infinix Note 40 5G ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్ ప్రీమియం డిజైన్, ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. అంతే కాకుండా ఈ ఫోన్‌పై కంపెనీ పరిమిత కాలం పాటు Infinix MagPadని ఉచితంగా అందిస్తోంది. లాంచ్ ఆఫర్‌లు, ధర, స్పెసిఫికేషన్‌లను వివరాలను చూడండి.

- Advertisement -

Infinix Note 40 5G స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే  ఈ ఫోన్‌లో పెద్ద 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంటుంది. ఇది FHD + రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. 1,300 నిట్‌ల పీక్ బ్రైట్నెస్, మరియు 2160Hz PWM డిమ్మింగ్‌ను అందిస్తుంది. MediaTek డైమెన్సిటీ 7020 SoC చిప్‌సెట్ ఉంటుంది. ఇది 8GB RAM+256GB UFS 3.1 స్టోరేజ్‌తో వస్తుంది. మీరు మైక్రో SD కార్డ్ స్లాట్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు.

- Advertisement -

Also Read: ఇది సూపర్.. రూ.11 వేలకే రెడ్‌మీ కొత్త ఫోన్.. జూలై 9న లాంచ్! 

కెమెరా గురించి చెప్పాలంటే 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, డెప్త్ లెన్స్‌తో లింక్ చేయబడిన మెయిన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అదే సమయంలో ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంది. ఈ కెమెరాలతో అద్భుతమైన ఫోటోలను తీయవచ్చు.పెద్ద 5,000mAh బ్యాటరీని ప్యాక్‌ని కలిగి ఉంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ MagSafe ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. హ్యాండ్‌సెట్ Android 14 OS ఆధారిత XOS 14 కస్టమ్ స్కిన్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో రన్ అవుతుంది.

ఇతర ఫీచర్ల గురించి మాట్లాడితే Infinix Note 40 5G ఫోన్‌లో JBL స్టీరియో స్పీకర్ ఉంది. ఈ ఫోన్  IP53 రేటింగ్‌‌తో వస్తుంది. కనెక్టివిటీ కోసం ఇది బ్లూటూత్ 5.3, డ్యూయల్ 4G LTE, USB టైప్-C, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, IR సెన్సార్ వంటి ఆప్షన్లు కలిగి ఉంది. నోట్ 40 5Gని సింగిల్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో విడుదల చేసింది. దీని ధర రూ.19,999. ఈ స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో జూన్ 26, 2024న ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌కి తీసుకొస్తున్నారు. ఇది రెండు కలర్ వేరియంట్‌లలో వస్తుంది. అందులో అబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ ఉన్నాయి.

Also Read: లెజెండ్.. ఒప్పో నుంచి బడ్జెట్ ఫోన్.. లుక్ అదిరింది!

ఆఫర్‌ల విషయానికొస్తే కస్టమర్‌లు ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి,యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించడం ద్వారా రూ. 2,000 తక్షణ తగ్గింపును పొందవచ్చు. దీనితో పాటు, రూ. 2,000 INR ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ ఆఫర్‌గా బాక్స్‌లో రూ. 1,999 విలువైన Infinix MagPadని ఉచితంగా అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News