Big Stories

Flipkart Mega June Bonanza: ఫ్లిప్‌కార్ట్ బిగ్గెస్ట్ డిస్కౌంట్స్.. ఈ ఐదు ఫోన్లు వదలకండి.. ఇవి పోతే రావ్..!

Flipkart Mega June Bonanza Sale 2024: ఫ్లిప్‌కార్ట్ మెగా జూన్ బొనాంజా సేల్ ఈరోజు జూన్ 13 నుండి ప్రారంభమై జూన్ 19 వరకు కొనసాగుతుంది. సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు బంపర్ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే ఈ బొనాంజా సేల్‌లో బెస్ట్ ఐదు డీల్స్ ఉన్నాయి. iPhone 15, Motorola Edge 50 Pro, realme 12x 5G, అనేక ఇతర స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు ఇస్తున్నారు. సేల్ సమయంలో అందుబాటులో ఉన్న టాప్ 5 స్మార్ట్‌ఫోన్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Vivo T3x 5G
వివో T3x 5G స్మార్ట్‌ఫోన్‌పై 22 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంటే ఈ ఫోన్ ధర రూ.17,499 నుంచి రూ.13,499కి తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాజర్లు కొనుగోళ్లపై రూ. 1,000 అదనపు డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు. ఇది కాకుండా మరికొన్ని డీల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల పూర్తి HD + డిస్‌ప్లే, 6,000 mAh పెద్ద బ్యాటరీ, Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ 50 మెగాపిక్సెల్ + 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

- Advertisement -

Motorola Edge 50 Pro
మోటరోలా Edge 50 Pro రూ. 29,999 ధరకు అందుబాటులో ఉంది. ఫోన్ అసలు ధర రూ.36,999. అదనంగా HDFC క్రెడిట్ కార్డ్ ఉపయోగించి EMI ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2,000 బ్యాంక్ ఆఫర్‌ను పొందవచ్చు. ఇది కాకుండా ఇతర ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ Motorola ఫోన్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, 4,500 mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. కెమెరా గురించి మాట్లాడితే ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. ఇది 13 మెగాపిక్సెల్, 10 మెగాపిక్సెల్ లెన్స్‌లతో వస్తుంది. సెల్ఫీ, వీడియో కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: HMD Ridge 5G Launch: బడ్జెట్ లెజెండ్.. HMD నుంచి చీపెస్ట్ 5G ఫోన్.. ఒక రేంజ్‌లో ఉంటది

Realme P1 5G
రియమీ P1 5g స్మార్ట్‌ఫోన్‌పై 23 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఫోన్ ధర రూ.20,999 నుంచి రూ.15,999కి తగ్గింది. సెలెక్టెడ్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 1,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. ఇది 6.67 అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, డైమెన్షన్ 7050 చిప్‌సెట్‌ ప్రాసెసర్ కలిగి ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. పవర్ కోసం 5,000 mAh బ్యాటరీ అందించారు.

Realme 12x 5G
రియల్‌మీ 12x 5G ధర రూ.17,999. ప్రస్తుతానికి ఫోన్ ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా రూ.12,999 ప్రత్యేక ధరకు అందుబాటులో ఉంది. సెలెక్టెడ్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.1,000 తగ్గింపును కూడా పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.72 అంగుళాల ఫుల్ HD + డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంది.  డైమెన్షన్ 6100+ చిప్‌సెట్ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఫోన్‌టలో 50 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

Also Read: iPhone 15 Pro Max Price Drop: భారీగా పడిపోయిన ఐఫోన్ 15 Pro మాక్స్ ప్రైస్.. ఇదే చివరి అవకాశం!

iPhone 15
ఈ బొనాంజా సేల్‌లో iPhone వనిల్లా వేరియంట్‌ ధర రూ.79,900 నుండి ప్రారంభమవుతుంది. కానీ ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో ఫోన్‌పై 19 శాతం భారీ తగ్గింపు అందిస్తోంది. ఈ  ఆఫర్ ద్వారా ఐఫోన్ ధర రూ.63,999 అవుతుంది. ఇది కాకుండా అనేక ఇతర బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. పర్ఫామెన్స్ కోసం A16 బయోనిక్ చిప్‌సెట్ ఉంది. ఇందులో 48-మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, మరొక 12 మెగాపిక్సెల్ కెమెరాను తీసుకొచ్చారు. 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News