Big Stories

iQOO Z9 Lite Smartphone: ఐక్యూ నుంచి నయా ఫోన్.. ధర ఇంత తక్కువ.. మతిపోతుంది!

iQOO Z9 Lite 5G Smart Phone Launching on July 15th: iQOO గత కొన్ని సంవత్సరాలుగా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి గుర్తింపును తెచ్చుకోంది. కంపెనీకి డిమాండ్ మార్కెట్‌లో భారీగానే ఉంది.  ఇప్పుడు కంపెనీ తన బ్రాండ్ నుంచి తదుపరి స్మార్ట్‌ఫోన్ iQOO Z9 Lite 5Gని లాంచ్ చేయనుంది. ఇది భారతదేశంలో లాంచ్ చేయబోయే  మొట్టమొదటి ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్. ఇప్పుడు ఫోన్ ఇండియా లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

iQOO Z9 Lite 5G విడుదలకు సంబంధించిన తేదీని ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో iQOO CEO నిపున్ టీజ్ చేశారు. అలానే ఇలా రాసుకొచ్చారు. ‘మీరు నెమ్మదిగా నడుస్తున్నారా? – ఇక అవసరం లేదు! #FullyLoaded5G అనుభవం మీ కోసం వేచి ఉంది! #iQOOZ9Lite’. అందులో ఫోన్ బ్లూ కలర్‌తో వస్తుంది. టీజర్‌లోని ఫోన్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ జూలై 15న ఇండియాలోకి రానుంది. సేల్ తేదీని ఇంకా వెల్లడించలేదు.

- Advertisement -

Also Read: గెట్ రెడీ.. తక్కువ ధరకే 5G ఫోన్లు.. మనందరికోసమే!

ఇది అత్యంత చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ iQOO Z9 Lite, iQOO Z9. మిడిల్ క్లాస్ ప్రజలను దృష్టిలో ఉంచుకొని కంపెనీ దీన్ని తీసుకొస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రౌన్, బ్లూ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. Z9 లైట్ Vivo T3 Lite రీబ్రాండెడ్ వెర్షన్‌గా తీసుకొచ్చే అవకాశం ఉంది. iQOO Z9 Lite ఫోన్ Vivo T3 లైట్‌‌లో ఫీచర్లతో సమానంగా ఉంటుంది. ఇది కూడా Vivo చీపెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్.

ఈ iQOO మొబైల్ ధర విషయానికి వస్తే  ప్రస్తుత లైనప్ Z9, Z9x మోడళ్లను రూ. 20,000 కంటే తక్కువ ధర కలిగి ఉంటుంది. అయితే Z9 లైట్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంది. దీని ధర రూ. 12,000 లేదా అంతకంటే తక్కువ ఉండవచ్చని లీక్స్ వస్తున్నాయి. ఇది ఎంట్రీ-లెవల్ 5G స్మార్ట్‌ఫోన్. ఫోన్ ధర గురించి పూర్తి సమాచారం లాంచ్ సమయంలో అందుబాటులోకి వస్తుంది.

Also Read: ఇక రెచ్చిపోండి.. ఒప్పో నుంచి కొత్త ఫోన్.. దుమ్ముదులిపేద్దాం!

iQOO Z9 Liteలో Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్‌లో ఉండే ఫీచర్లు ఉండినట్లయితే అది MediaTek Dimensity 6300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. ఇది రియల్‌మీ నార్జో N65, C65 వంటి బడ్జెట్ 5G ఫోన్‌లానే ఉంటుంది. అదనంగా Z9 లైట్ 50-మెగాపిక్సెల్ సోనీ AI కెమెరాను కలిగి ఉంది. ఇది సెకండరీ సెన్సార్‌తో అద్భుతమైన ఫోటోలను తీస్తుంది. ఫోటోగ్రఫీ కోసం కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను తీసుకొస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News