Big Stories

Tecno Spark 20 Pro 5G: తస్సాదియ్య.. 108 మెగా పిక్సెల్ కెమెరాతో మరో కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?

Tecno Spark 20 Pro 5G: టెక్ బ్రాండ్ Tecno మార్కెట్‌లో తన ఆదిపత్యాన్ని చెలాయించాలని చూస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫోన్లను దేశీయ మార్కెట్‌లో రిలీజ్ చేస్తుంది. బడా కంపెనీ ఫోన్లకు పోటీగా తన 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే చాలా మోడళ్లను పరిచయం చేసిన కంపెనీ తాజాగా తన Spark 20 సిరీస్‌లో మొదటి 5G ఫోన్‌ ‘Tecno Spark 20 Pro 5G’ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

- Advertisement -

ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల అంటే జూలైలో భారతదేశంలో లాంచ్ కానుంది. గత నెల జూన్ 20న ఈ ఫోన్ సౌదీ అరేబియాలో లాంచ్ చేయబడింది. త్వరలో ఇది మిడిల్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఆసియా, లాటిన్ అమెరికాలో కూడా అందుబాటులో ఉండనుంది. కాగా ఇప్పుడు భారతదేశంలో లాంచ్ చేయడానికి ముందు ఫోన్ స్పెసిఫికేషన్ వివరాలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి.

- Advertisement -

ఆ లీక్‌ల ప్రకారం.. భారతదేశంలో విడుదల చేయబోయే Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్‌‌లో 108 మెగాపిక్సెల్ కెమెరాను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది ఈ ఫోన్ ప్రధాన కెమెరా సెన్సార్ అవుతుంది. ఈ ఫోన్‌లో గరిష్టంగా 16 GB RAM ఉంటుంది. అందులో 8GB ఫిజికల్ RAM, 8GB వర్చువల్ RAM ఉంటుంది. అలాగే 128 GB, 256GB స్టోరేజీ వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. ఇవి కాకుండా భారతీయ మోడల్ గురించి ఇతర సమాచారం అందుబాటులో లేదు. కానీ ఇతర స్పెసిఫికేషన్‌లు గ్లోబల్ మోడల్‌గా ఉండే అవకాశం ఉంది.

Also Read: 108MP కెమెరా, MediaTek డైమెన్సిటీ 6080 ప్రాసెసర్‌తో ఫోన్ వచ్చేసింది.. ఇక మార్కెట్లో చెడుగుడే..!

Tecno Spark 20 Pro 5G ఫోన్.. 1080×2460 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 6080 5G ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8GBRAM అమర్చబడింది. ఆపరేటింగ్ సిస్టమ్ పరంగా ఈ స్మార్ట్‌ఫోన్ Android 14 ఆధారంగా HIOS 14 పై పనిచేస్తుంది.

Tecno Spark 20 Pro 5G వెనుక భాగంలో 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అలాగే ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్‌లు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోసీ వైట్, నియాన్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News