Big Stories

Senior Citizens Phone: జేబులో డాక్టర్ ఉన్నట్లే.. తల్లిదండ్రులకు పర్ఫెక్ట్ ఫోన్లు.. ఇదేదో భలేగా ఉందే..!

Senior Citizens Phone: మీరు మీ తల్లిదండ్రుల కోసం మంచి ఫోన్‌ని కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. సీనియర్ వరల్డ్ రెండు కొత్త ఫోన్లను లాంచ్ చేసింది. కంపెనీ రెండు కొత్త 4G ఈజీ ఫోన్ మోడల్స్ రాయల్ 4G, ఎలైట్ 4Gలను విడుదల చేసింది. రాయల్ 4G మిడిల్ ఫ్లిప్ ఫోల్డ్ డిజైన్‌తో వస్తుంది. ఎలైట్ 4G సాధారణ ఫీచర్ ఫోన్ డిజైన్‌ను కలిగి ఉంది. సీనియర్ సిటిజన్ల కోసం వీటిని ప్రత్యేకంగా రూపొందించారు. ఈ ఫోన్‌లు మెరుగైన కనెక్టివిటీ, భద్రత, హెల్త్ అసిస్టెంట్ అందిస్తాయి.

- Advertisement -

అంబులెన్స్ కోఆర్డినేషన్ సర్వీస్ ఈజీఫోన్ ఎలైట్ 4G, Easy Phone Royale 4G అనేవి సీనియర్ వరల్డ్ ఈజీఫోన్ సిరీస్‌లో అందుబాటులో ఉంటాయి. రెండు కొత్త మోడల్‌లు ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటాయి. ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర ఫోన్‌ల నుండి డిఫరెంట్‌గా ఉంటాయి. రెండు మోడల్‌లు దేశవ్యాప్తంగా 700 నగరాల్లో అందుబాటులో ఉన్న 24/7 అంబులెన్స్ కోఆర్డినేషన్ సర్వీస్‌ను కలిగి ఉన్నాయి.

- Advertisement -

వైద్యపరమైన అత్యవసర పరిస్థితులకు ప్రతిస్పందించడానికి, విలువైన సమయాన్ని ఆదా చేయడానికి వీటిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అథరైజిడ్ నంబర్‌ల నుండి మాత్రమే కాల్‌లను అనుమతిస్తుంది. స్పామ్, అనవసరమైన కాల్‌లను నిరోధించే “సేఫ్లిస్ట్” ఫీచర్ దీని ప్రత్యేక ఫీచర్లలో మరొకటి. ఫోన్‌లోని SOS బటన్‌తో పాటు, ఇది కేర్‌టచ్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

Also Read: ఏమి తేజస్సు.. షియోమీ నుంచి కిరాక్ ఫోన్.. ఇక వాటికి చుక్కలే!

ఇది ప్రపంచంలో ఎక్కడి నుండైనా easyfone royale ఫోన్‌ని రిమోట్‌గా కాన్ఫిగర్ చేయడానికి కుటుంబ సభ్యుడిని ఎనేబుల్ చేసే కేరింగ్ సర్వీస్. ఇందులో మందులు తీసుకోవడానికి రిమైండర్‌లను సెట్ చేయడం, డాక్టర్ అపాయింట్‌మెంట్‌లను షెడ్యూల్ చేయడం, వాల్యూమ్‌లను అడ్జెస్ట్ చేయడం, అడ్రస్ బుక్‌లో మార్పులు చేయడం, మోసాన్ని నిరోధించడానికి సేఫ్‌లిస్ట్‌లను సెటప్ చేయడం వంటివి ఉంటాయి.

రెండు మోడల్‌లు కూడా ప్రత్యేకమైన SOS బటన్‌ను కలిగి ఉంటాయి. ఈ బటన్ నొక్కినప్పుడు మీరు సెట్ చేసిన ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తుంది..ఈ రెండు మోడల్‌లు 12 భారతీయ ప్రాంతీయ భాషలలో బ్రెయిన్ గేమ్‌లు, వృద్ధులను నిమగ్నమై ఆరోగ్యంగా ఉంచడానికి రోజువారీ ఇన్స్‌ఫిరేషన్, ఆరోగ్య చిట్కాలు వంటి అనేక ఫీచర్లతో వస్తాయి.

Also Read: ఇన్నాళ్లకు సరైన ఫోన్.. సామ్‌సంగ్ కొత్త మొబైల్.. కుర్చీని మడత పెట్టుడే!

ఫోన్‌లు ఛార్జింగ్ డాక్‌తో వస్తాయి. రెండు మోడల్‌లు 2.8-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంటాయి. ఫోన్ నంబర్‌ను డయల్ చేయడానికి పెద్ద బటన్‌ను కలిగి ఉంది. తద్వారా నంబర్‌ను డయల్ చేయడంలో వినియోగదారుకు ఎలాంటి సమస్య ఉండదు. పవర్ కోసం ED డాక్ ఛార్జింగ్, బ్యాటరీని కలిగి ఉంది. ఫుల్ ఛార్జింగ్‌పై రెండు వారాల స్టాండ్‌బై సమయాన్ని ఈ ఫోన్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. రెండు ఫోన్‌లు అమెజాన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈజీఫోన్ రాయల్ 4జీ ధర రూ.4,690 కాగా, ఈజీఫోన్ ఎలైట్ 4జీ ధర రూ.4,490.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News