BigTV English

New Radar System:రేడియో ఆస్ట్రానమీలో కొత్త పరికరం.. తక్కువ ఖర్చుతో..

New Radar System:రేడియో ఆస్ట్రానమీలో కొత్త పరికరం.. తక్కువ ఖర్చుతో..

New Radar System:కొన్నాళ్ల క్రితం స్పేస్‌పై పరిశోధనలు చేయాలని శాస్త్రవేత్తలకు ఆసక్తి ఉన్నా.. తగిన టెక్నాలజీ లభించేది కాదు. కానీ గత కొన్నేళ్లలో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్పేస్‌కు సంబంధించిన ప్రతీ పరిశోధనకు సాయం చేసే స్థాయికి ఎదిగింది. అందుకే ఆస్ట్రానమీ కూడా ఎన్నో విభాగాలుగా విభజించబడింది. అందులో ఒకటే రేడియో ఆస్ట్రానమీ. తాజాగా రేడియో ఆస్ట్రానమీ పరిశోధకులు ఓ కొత్త పరికరాన్ని తయారు చేశారు.


ప్రస్తుతం స్పేస్ అనేది శాటిలైట్లతో, స్పేస్ మిషిన్లతో నిండిపోయిందని శాస్త్రవేత్తలు ఎప్పుడో తెలిపారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏ ప్రాంతంలో తిరుగుతున్నాయో తెలుసుకోవడానికి వారికి సెన్సార్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ సెన్సార్ సిస్టమ్స్ తయారీకి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రేడియో ఆస్ట్రానమీ రిసెర్చ్ (ఇక్రార్) పరిశోధకులు తక్కువ ఖర్చుతో ఒక సెన్సార్ సిస్టమ్‌ను తయారు చేశారు. ఇది స్పేస్‌లోని చెత్తను, శాటిలైట్లను, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను కనిపెట్టడానికి సహాయపడుతుంది.

స్పేస్ డొమేయిన్ అవేర్నేస్ (ఎస్డీఏ) పేరుతో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ఓ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్‌లో రేడియో ఆస్ట్రానమీలో ఉపయోగపడే టెక్నాలజీల సాయంతో తక్కువ ఖర్చుతో ఒక రాడార్ సిస్టమ్‌ను తయారు చేయాలని వారు నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు ఉన్న రాడార్ సిస్టమ్స్ కేవలం ఒక సిగ్నల్‌ను ట్రాన్స్‌మిట్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ పాసివ్ రాడార్ సిస్టమ్ అలా కాదు.. రేడియో, టీవీ లాంటి పరికరాల నుండి వచ్చే సిగ్నల్స్‌ను కూడా ట్రాన్స్‌మిట్ చేయగలుగుతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.


ఈ కొత్త రాడార్ సిస్టమ్ 32 ఆంటీనాలతో తయారు చేయబడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇతర రాడార్ సిస్టమ్ లాగా ఇది కంటికి కనిపించేంత పెద్దగా ఉండదు కాబట్టి.. డిఫెన్స్ వంటి వాటిలో ఇది బాగా ఉపయోగపడుతుందని వారు చెప్తున్నారు. ఈ రాడార్ సిస్టమ్‌ను తయారు చేయడానికి ఇక్రార్ శాస్త్రవేత్తలు.. రేడియా ఆస్ట్రానమీని పూర్తిగా స్టడీ చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా డిఫెన్స్ కోసమే దీనిని ఏర్పాటు చేసినట్టుగా సమాచారం. ఈ పరిశోధనలకు డిఫెన్స్ సైన్స్ సెంటర్, వెస్టెర్న్ ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా సహాయంగా నిలబడింది.

People and Government:ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలు.. ప్రైవసీ విషయంలో..

Key Tests:చంద్రయాన్ 3 అప్డేట్.. టెస్టులు పూర్తి..

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×