EPAPER

People and Government:ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలు.. ప్రైవసీ విషయంలో..

People and Government:ప్రజలు వర్సెస్ ప్రభుత్వాలు.. ప్రైవసీ విషయంలో..

People and Government:ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగ సంస్థలు ఎన్ని ప్రయోగాలు చేసినా.. ముఖ్యంగా దృష్టిపెట్టవలసింది పబ్లిక్ హెల్త్‌పైనే. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయంతో వ్యాధులను నివారించడం పబ్లిక్ హెల్త్‌కు ముఖ్య లక్ష్యం. దాంతో పాటు జీవితకాలాన్ని పెంచడం, చుట్టూ ఉన్న వాతావరణం ద్వారా ఆరోగాన్ని కాపాడడం ఇవన్నీ కూడా పబ్లిక్ హెల్త్‌లో మరికొన్ని ముఖ్యమైన అంశాలు.


ఇటీవల ప్రజలకు ఎదురైన మహమ్మారి కోవిడ్ వల్ల ప్రజలకు చాలావరకు హెల్త్ సెక్టార్‌పై కొంత అవగాహన ఏర్పడింది. స్పైక్ ప్రొటీన్, వైరస్, ఇమ్యూనిటీ, ఆర్ ఫ్యాక్టర్, వ్యాక్సిన్స్, బూస్టర్ షాట్స్.. ఇలాంటి పదాలు అందరికీ పరిచయమయ్యాయి. అంతే కాకుండా వివిధ రకాల వైరస్‌లు ఎలా వ్యాపిస్తాయి, దాని వల్ల మానవాళికి వచ్చే నష్టమేంటి అన్న విషయాలపై కూడా అవగాహన వచ్చింది. ఆరోగ్య సేతు వంటి యాప్స్ ద్వారా వైరస్ కదలికను ఎప్పటికప్పుడు కనిపెట్టే సౌలభ్యం కూడా ఏర్పడింది. కేవలం ఐసోలేషన్ విషయంలోనే కాకుండా ప్రభుత్వాలు ఎన్నో విధాలుగా పేషెంట్లను అండగా నిలబడ్డాయి.

పబ్లిక్ హెల్త్ అనేది ఉండాలంటే ముందుగా ఎవరికి వారు స్వతంత్ర్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నిపుణులు చెప్తున్నారు. అంటే ప్రతీ ఒక్కరికి ప్రైవసీ అనేది అవసరమని వారు అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు కూడా ఎన్నోసార్లు ఇతరుల ప్రైవసీకి భంగం కలిగించడం తప్పని మందలించాయి. అంతే కాకుండా ప్రైవసీ అనేది రాజ్యాంగంలో ఒక భాగమయిపోయింది. అందుకే ప్రభుత్వాలు కూడా సొసైటీ ప్రైవసీకి భంగం కలిగించకుండా పాలిసీలను పాటించేలా చేయాల్సి ఉంటుంది. అసలు సమస్యలు అక్కడే మొదలవుతుంది.


ప్రస్తుతం హెల్త్ గవర్నెన్స్‌లో కూడా టెక్నాలజీ పెరిగిపోయింది. దీని ద్వారా పబ్లిక్ హెల్త్ స్కీమ్స్ అనేది చాలామందికి దగ్గరవుతున్నాయి. దీనిని పరిశీలిస్తూ ముందుకెళ్లేలాగా భారత ప్రభుత్వం.. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషిన్ అనే విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు అది ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషిన్ (ఏబీడీఎమ్)గా పేరు కూడా మార్చుకుంది. ఇందులో ప్రతీ ఒక్క పౌరుడికి సంబంధించిన హెల్త్ డేటా పొందుపరిచి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులకే కాదు.. ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా ఈ డేటాకు యాక్సెస్ ఉంది. అయితే దీని వల్ల ప్రజల ప్రైవసీకి భంగం కలుగుతుందని కొందరు శాస్త్రవేత్తలు, లీగల్ సలహాదారులు చెప్తున్నారు.

ఈరోజుల్లో డేటా అనేది ఏ విధంగా దొంగలించబడుతుందో గుర్తించేలోపే.. అంతా సైబర్ క్రిమినల్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. అంతే కాకుండా ఇండియాలో డేటా ప్రొటెక్షన్‌కు సంబంధించి ఒక లీగల్ ఫ్రేమ్ వర్క్ కూడా లేదు. 2019లో ప్రజల ప్రైవసీని కాపాడడానికి పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది పాస్ అయినా కూడా అందులో కొన్ని లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. అందుకే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనే మరో బిల్ డ్రాఫ్ట్‌ను లీగల్ టీమ్ సిద్ధం చేసింది. హెల్త్ సెక్టార్‌లో ప్రజల డేటాను పొందుపరచడం, ప్రజల ప్రైవసీకి భంగం కలిగించడం అనేది ఎప్పటికీ ఒక కాంట్రవర్సీ టాపిక్ అని నిపుణులు చెప్తున్నారు.

China Compound:గ్రహశకలాలను గమనించే ‘చైనా కంపౌండ్ ఐ’..

New Cell Technology:ట్యూమర్లను కనిపెట్టే సెల్ టెక్నాలజీ..

Tags

Related News

Johnny Master : జానీ మాస్టర్ పై వేటు.. కేసు పెట్టడం పై ఆ హీరో హస్తం ఉందా?

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Big Stories

×