E-Paper
Advertisement

3D Bioprinting:3డి బయోప్రింటింగ్‌తో కంటి సమస్యలకు పరిష్కారం..

3D Bioprinting:3డి బయోప్రింటింగ్‌తో కంటి సమస్యలకు పరిష్కారం..
Advertisement

3D Bioprinting:ఇప్పటికే టెక్నాలజీని ఉపయోగించి శరీర భాగాల దగ్గర నుండి ఉపయోగించే వస్తువుల వరకు ఎన్నో కృత్రిమంగా కనిపెట్టారు శాస్త్రవేత్తలు. మెడికల్ విభాగంలో కృత్రిమ మేధస్సును ఉపయోగించి మరికొన్ని పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఆలోచిస్తున్నారు. తాజాగా ఓ శరీర భాగాన్ని కృత్రిమంగా తయారు చేయడానికి వారు చేసిన పరిశోధన సక్సెస్ అయ్యింది.

పేషెంట్స్ సెల్స్‌తో పాటు 3డి బయోప్రింటింగ్ ద్వారా నేషనల్ ఐ ఇన్స్‌టిట్యూట్ (ఎన్ఈఐ) కంటి బ్లడ్ రెటీనా బారియర్‌ను తయారు చేశారు. పేషెంట్ నుండి తీసిన సెల్స్ ద్వారా కంటి రెటీనాకు సంబంధించిన వ్యాధులను ముందుగానే కనుక్కోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. వయసు పెరుగుతున్నకొద్దీ కంటిచూపు మందగించడం లాంటివి ఈ ప్రక్రియ ద్వారా సులువుగా కనుగొనవచ్చని వారు అన్నారు.

Advertisement

ఉన్నట్టుండి వయసుతో సంబంధం లేకుండా కొందరి కంటిచూపు మందగిస్తుంది. అంతే కాకుండా కొందరు పూర్తిగా చూపు కోల్పోతారు కూడా. ఇలాంటివి ఎందుకు జరుగుతాయో తెలుసుకోవడానికి ఈ కృత్రిమ కన్ను ఉపయోగపడుతుందని వైద్యులు భావిస్తున్నారు. వయసుతో పాటు కంటిచూపులో వచ్చే సమస్యలను ఈ 3డి బయోప్రింటింగ్ టెక్నాలజీ కనిపెడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కంటిలోని మూడు సెల్స్‌ను తీసి జోడించడం వల్ల అది ఒక టిష్యూలాగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పుడు దానిని 3డి బయోప్రింటింగ్ ద్వారా ఔటర్ బ్లడ్ రెటీనా బారియర్‌ను తయారు చేశామన్నారు. అలా తీసుకున్న టిష్యూలు 42వ రోజున పూర్తిగా స్టడీ చేయడానికి సిద్ధమవుతాయని వారు కనుగొన్నారు. దీనిని ఉపయోగించి చేసిన పరిశోధనల్లో ఒత్తిడి వల్లే చాలావరకు కంటి సమస్యలు వస్తున్నట్టు వారు గమనించారు.

Advertisement

ఒకటే విధమైన ప్రింటింగ్ ప్యాటర్న్‌ను ఫాలో అవ్వడానికి ఇబ్బందులు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానికి హైడ్రోజల్ పరిష్కారమని వారు భావిస్తున్నారు. డీజెనరేటివ్ కంటి వ్యాధుల నుండి పరిష్కారం పొందేలాగా వారొక రెటీనా టిష్యూను తయారు చేసినట్టు శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఇలాంటి టిష్యూలు మరెన్నో సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తాయని వారు నమ్ముతున్నారు.

Shape Changing Robot: షేప్ మార్చుకునే రోబో.. త్వరలోనే మార్కెట్‌లోకి..

China Occupy Place on Moon: చంద్రుడిపై స్థలాన్ని ఆక్రమించుకోనున్న చైనా..!

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×