BigTV English

Shape Changing Robot: షేప్ మార్చుకునే రోబో.. త్వరలోనే మార్కెట్‌లోకి..

Shape Changing Robot: షేప్ మార్చుకునే రోబో.. త్వరలోనే మార్కెట్‌లోకి..

Shape Changing Robot:ఇప్పటికే రోబోటిక్స్‌లో ఎన్నో అద్భుతాలను చేశారు శాస్త్రవేత్తలు. కొత్త రకమైన రోబోల తయారీతో ఎప్పటికప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. అయినా ఇంకా కొత్తగా ఏదో చేయాలనే తపన శాస్త్రవేత్తల ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఓ కొత్త రకమైన రోబో తయారీ టెక్నాలజీ వరల్డ్‌నే ఆశ్చర్యపరుస్తోంది.


రోబోలు అనేవి మెటల్ శరీరంతో గట్టిగా ఏర్పాటు చేయబడతాయి. కానీ రూపం మార్చే రోబోను ఎప్పుడైనా చూశారా..? ఇలా సందర్భాన్ని బట్టి ఆకారాన్ని మార్చే రోబోలను ఇప్పటికీ మనం పలు ఇంగ్లీష్ సినిమాల్లో చూశాం. 1991లో విడుదలయిన టెర్మినేటర్ 2లో ఇలాంటి ఓ రోబో ఉంటుంది. ఇప్పుడు ఆ రోబో రియాలిటీలో కూడా తయారు చేయబడింది. ఇన్నాళ్లకు రూపాన్ని మార్చుకునే రోబోను తయారు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు.

రోబోకు అమర్చబడిన ఓ చేయి.. బిగువైన ప్రాంతాలలోకి వెళ్లడానికి తన రూపం మార్చుకుంటుంది. ఆ తర్వాత మళ్లీ మామూలుగా అయిపోతుంది. ఇది ఓ అదునాతనమైన ప్రయోగం అని శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఇలా షేప్ మార్చే రోబోలు ప్రపంచంలోనే మొదటిసారిగా తయారు చేయబడ్డాయి. మెడికల్‌, రెస్క్యూ విభాగాల్లో ఈ రోబోలు ఎంతో ఉపయోగపడనున్నాయి.


చైనాకు చెందిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లతో ఈ రోబో తయారీ జరిగింది. బిగువుగా ఉన్న ప్రాంతాలకు చేరుకున్న తర్వాత ఈ రోబో ముందు ఉన్న షేప్‌లోకి మారిపోయి సౌలభ్యంతో తయారు చేయబడ్డాయి. సముద్రాల్లో పెరిగే సీ కుకుంబర్ ఈ ప్రయోగానికి స్ఫూర్తి అని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. సీ కుకుంబర్ కూడా పరిస్థితులను బట్టి గట్టిగా మారుతుంది. మళ్లీ కాసేపటికి మామూలుగా మారిపోతుంది. ఈ రోబోలు కూడా అలాగే పనిచేస్తాయని వారు అంటున్నారు.

రోబోల తయారీ పూర్తిగా అయిపోయినా కూడా ఇంకా వారు చేయాల్సిన మార్పులు కొన్ని ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అందుకే ఇవి మామూలు రోబోలకంటే కాస్త భిన్నమని అన్నారు. అందుకే మరిన్ని పరిశోధనలను చేసి ఈ షేప్ మార్చుకునే రోబోలను మరింత పవర్‌ఫుల్‌గా తయారు చేయాలని వారు అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పరిశోధనలు పూర్తయిన తర్వాత ఈ రోబోలతో ప్రయోగాలు మొదలుకానున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

3D Bioprinting:3డి బయోప్రింటింగ్‌తో కంటి సమస్యలకు పరిష్కారం..

China Occupy Place on Moon: చంద్రుడిపై స్థలాన్ని ఆక్రమించుకోనున్న చైనా..!

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×