Big Stories

Samsung Upcoming Phones: భయ్యా ఇక చెడుగుడే.. చవకగా సామ్‌సంగ్ అప్ కమింగ్ ఫోన్లు.. ధర ఎంతంటే?

Upcoming Phones form Samsung Galaxy A Series: ఇప్పటికే పలు రకాల మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకువచ్చి ఫోన్ ప్రియులను ఆకట్టుకున్న ప్రముఖ దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో దాని గెలాక్సీ A సిరీస్‌లో రెండు కొత్త చౌకైన ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ప్రస్తుతం కంపెనీ తన రాబోయే ఫోన్‌లపై పని చేస్తోంది. అయితే ఈ రాబోయే Samsung ఫోన్‌ల లాంచింగ్ టైమ్ లైన్, ధర, స్పెక్స్ వివరాలు లీక్ అయ్యాయి.

- Advertisement -

ఈ రెండు ఫోన్‌ల లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఇంకా అధికారిక సమాచారాన్ని వెల్లడించలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం చివరి నాటికి లేదా వచ్చే ఏడాది మొదట్లో సామ్‌సంగ్ తన రాబోయే స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన ఈ బ్రాండ్ ఫోన్‌ల పేరు, ధర, ఫీచర్ల గురించి మరింత తెలుసుకుందాం.

- Advertisement -

నివేదికల ప్రకారం.. ఈ ఫోన్‌లు Galaxy A15, Galaxy A05 ఫోన్ల అప్‌గ్రేడ్ మోడల్‌లుగా ఉంటాయి. ఇవి మార్కెట్లో Samsung Galaxy A16, Galaxy A06గా రిలీజ్ కానున్నాయి. ఈ రెండు ఫోన్‌లు వచ్చే ఏడాది అంటే 2025లో ప్రపంచ మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫోన్ల ధర విషయానికొస్తే.. కంపెనీ Samsung Galaxy A సిరీస్‌లోని రెండు ఫోన్‌లను బడ్జెట్ ఫోన్‌లుగా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్లు 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో రావచ్చు. వీటి ధర 20 యూరోల కంటే తక్కువ నిర్ణయించబడుతుంది.. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 18,200గా తెలుస్తోంది.

Also Read: బ్లాక్ బస్టర్ డీల్.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. లూట్ రా మావా బ్రో!

Samsung Galaxy A16 మోడల్ నంబర్ SM-A166B, Galaxy A06 SM-A065M పేరుతో ఇటీవల కనిపించింది. ప్రస్తుతానికి ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్ గురించి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు. అయితే సామ్‌సంగ్ వీటితో పాటు Samsung Galaxy A36, Galaxy A56 లపై కూడా పని చేస్తోంది. ఇది ఏప్రిల్ 2025లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.

కాగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న Samsung Galaxy A15 5G స్పెసిఫికేషన్‌ల విషయానికొస్తే.. ఇది 6.5-అంగుళాల పూర్తి-HD సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 800నిట్‌ల గరిష్ట ప్రకాశంతో అమర్చబడింది. ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 8GB RAM + 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. దీనితో పాటు ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా ఉన్నాయి. ఈ మొబైల్‌ను శక్తివంతం చేయడానికి సామ్‌సంగ్ బ్రాండ్ దీనికి 25W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 5,000mAh బ్యాటరీని అందించింది.

Also Read: ఆఫర్ ఏంట్రా ఇంత టెంప్టింగ్‌గా ఉంది.. ఓరి దేవుడా ఇప్పుడు ఈ ఫోన్ కొనకుండా ఉండటం ఎలా!

అలాగే Samsung Galaxy A05 5G స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే.. ఇది 6.7 అంగుళాల PLS LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. HD+ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్‌లతో 60Hz రిఫ్రెష్ రేట్‌తో అమర్చబడింది. 50MP ప్రధాన కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News