Big Stories

Samsung New 5G Mobile: ఇన్నాళ్లకు సరైన ఫోన్.. సామ్‌సంగ్ కొత్త మొబైల్.. కుర్చీని మడత పెట్టుడే..!

Samsung New 5G Mobile: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు సామ్‌సంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ Samsung Galaxy M35 5Gని దేశీయ మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. ఫోన్‌ను అమోజాన్‌లో సేల్‌కు తీసుకొస్తున్నట్లు టీజ్ చేసింది. అయితే ఫోన్ కచ్చితమైన లాంచ్ తేదిని వెల్లడించలేదు. కానీ, ఈ ఫోన్ అమెజాన్ రాబోయే ప్రైమ్ డే సేల్‌లో లాంచ్ చేస్తున్నట్లు ధృవీకరించింది. సామ్‌సంగ్ గెలాక్సీ M35 5G ఎక్సినోస్ 1380 ప్రాసెసర్‌తో మేలో గ్లోబల్ మార్కెట్‌లలో విడుదల చేశారు. Galaxy M35 5G 25W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్రత్యేకత ఏమిటి? ఇప్పటి వరకు వెల్లడైన వివరాలపై ఓ లుక్కేద్దాం.

- Advertisement -

అమెజాన్‌లో విడులవడానికి సిద్ధంగా ఉన్న Samsung Galaxy M35 5G లాంచ్ గురించి దాని వెబ్‌సైట్‌లోని బ్యానర్ ద్వారా తెలియజేసింది. ఇది జూలై 20 నుండి జూలై 21 వరకు జరిగే అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2024లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. అయితే లాంచ్ చేసే కచ్చితమైన తేదీ,  సమయం బ్యానర్‌లో వెల్లడించలేదు. ఈ ఫోన్ గురించి మరెన్నో ఇంటరెస్టింగ్ విషయాలను ఈ కామర్స్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా తెలుసుకోవచ్చు.

- Advertisement -

Also Read: ఊచకోతే.. వివో మిడ్ రేంజ్ ఫోన్.. డబ్బులు దాచుకో!

బ్రెజిల్‌లో 8GB RAM +256GB స్టోరేజ్‌తో Galaxy M35 5G స్మార్ట్‌ఫోన్ సింగిల్ వేరియంట్ ధర BRL 2,699 (సుమారు రూ. 43,400). ఇది థిక్ బ్లూ, గ్రే, బ్లూ కలర్‌లో తీసుకొచ్చారు. సామ్‌సంగ్ భారతదేశంలో కూడా అదే ధర, వేరియంట్‌లో ఈ ఫోన్ తీసుకురావచ్చు.

Samsung Galaxy M35 5G గ్లోబల్ వేరియంట్‌లో 6.6-అంగుళాల పూర్తి-HD+ (1080×2340 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. ఇది 8GB RAM+ 256 GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది. ఫోన్‌లో ఆక్టా-కోర్ Exynos 1380 చిప్‌సెట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు.

Also Read: ఐక్యూ నుంచి నయా ఫోన్.. ధర ఇంత తక్కువ.. మతిపోతుంది!

Samsung Galaxy M35 5G ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. దీనిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News