Big Stories

Samsung Galaxy M35 5G: శాంసంగ్ నుంచి తోపు ఫోన్.. ఫీచర్లు వేరే లెవెల్.. లాంచ్ ఎప్పుడంటే..?

Samsung Galaxy M35 5G Launching on July 17th: ఇటీవల కాలంలో స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎక్కువైపోయారు. ఎవ్వరి చేతిలో చూసినా కొత్త స్మార్ట్‌ఫోన్ దర్శనమిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌తో లీనమైపోతున్నారు. అందువల్లనే ప్రముఖ కంపెనీ తయారుదారులు కూడా స్మార్ట్‌ఫోన్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని కొత్త కొత్త ఫీచర్లతో తక్కువ ధరలో మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. సామాన్యులు మెచ్చే స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. అందులో శాంసంగ్ కంపెనీ ఫోన్లు ఒకటి.

- Advertisement -

ఈ కంపెనీ ఫోన్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. కొత్త కొత్త ఫోన్లను రిలీజ్ చూస్తూ తన ఆదిపత్యాన్ని నిరూపించుకుంటుంది. అయితే ఇప్పటికే చాలా మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్ ఇప్పుడు మరో కొత్త మోడల్‌ను పరిచయం చేయడానికి సిద్ధమైంది. శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy M35 5G జూలై 17న భారతదేశంలో విడుదల కానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్‌కు ముందే కంపెనీ అనేక ఫీచర్లను వెల్లడించింది.

- Advertisement -

Galaxy M35 5G వినియోగదారులకు 4 సంవత్సరాల పాటు OS అప్‌గ్రేడ్‌లు ఇవ్వబడతాయని కూడా చెప్పింది. ఇది ‘M’ సిరీస్‌లో మధ్యరేంజ్ మొబైల్. ఈ ఫోన్ మొదటిసారిగా మేలో ప్రవేశపెట్టబడింది. ఈ ఫోన్ 6 వేల ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుందని టీజర్ ద్వారా వెల్లడైంది. ఇది కాకుండా ఈ ఫోన్‌ను ‘ప్రైమ్ డే ఎక్స్‌క్లూజివ్’గా విడుదల చేయనున్నట్లు అమెజాన్ టీజర్ వెల్లడించింది. ఇది జూలై 21, 22 తేదీలలో జరగనుంది. ఈ ఫోన్ డార్క్ బ్లూ, లైట్ బ్లూ, బూడిద రంగులలో వస్తుంది. అయితే ఈ ఫోన్ ధర ఇంకా వెల్లడి కాలేదు.

Also Read: అందరూ ఒకలెక్క.. శామ్‌సంగ్ మరోలెక్క.. 4జీ వెర్షన్‌లో దుమ్ముదులిపే ఫీచర్లతో కొత్త ఫోన్..!

Samsung Galaxy M35 5G Specifications

Samsung Galaxy M35 5G.. 6.6-అంగుళాల FHD+ (1080×2340 పిక్సెల్‌లు) సూపర్ AMOLED ఇన్ఫినిటీ O డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్‌ల గరిష్ట ప్రకాశాన్ని అందిస్తుంది. Galaxy M35లో Samsung Exynos 1380 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్‌ను 6 GB/ 8 GB RAM ఆప్షన్లలో వచ్చే అవకాశం ఉంది. అలాగే 256 GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో రానుంది. దీనిని SD కార్డ్ ద్వారా 1 TB వరకు విస్తరించవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ M35 5G ఆండ్రాయిడ్ 14 OS పై రన్ అవుతుంది. ఈ ఫోన్ వెనుక వైపు 50MP ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది OIS మద్దతుతో వస్తుంది. ఫోన్‌లో 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్, 2 MP మాక్రో కెమెరా సెటప్ కూడా ఉంది. ఇక ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్‌లో 6000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. 222 గ్రాముల బరువున్న ఈ ఫోన్ టైప్-సి పోర్ట్, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ ఫీచర్లతో రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News