Big Stories

Samsung Galaxy A16 4G Launch: అందరూ ఒకలెక్క.. శామ్‌సంగ్ మరోలెక్క.. 4జీ వెర్షన్‌లో దుమ్ముదులిపే ఫీచర్లతో కొత్త ఫోన్!

Samsung Galaxy A16 4G Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీదారు శామ్‌సంగ్ గత కొన్నేళ్ల నుంచి ఫోన్ల మార్కెట్‌లో తన ఆదిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే కొత్త కొత్త ఫోన్లను ట్రెండింగ్ ఫీచర్లతో తీసుకొస్తూ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా సామాన్యులకు బడ్జెట్ ధరలో కూడా స్మార్ట్‌ఫోన్లను అందిస్తోంది. అయితే ఇప్పటికే చాలా ఫోన్లను మార్కెట్‌లో రిలీజ్ చేసిన శామ్‌సంగ్ ఇప్పుడు మరొక కొత్త సిరీస్‌ను లాంచ్ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

శామ్‌సంగ్ త్వరలో తన A సిరీస్‌లో మరో మోడల్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అదే Samsung Galaxy A16 సిరీస్‌. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్లు, ఇతర వివరాలు తాజాగా బయటకొచ్చాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ A సిరీస్‌‌ Samsung Galaxy A16 4G వెర్షన్‌లో రాబోతుంది. ఈ Galaxy A16 4G దాని మునుపటి మోడల్ Galaxy A15 4G కంటే మెరుగైన ఫీచర్లను అందిస్తుందని భావిస్తున్నారు. Galaxy A15, Galaxy A16 మధ్య వ్యత్యాసం ఫోన్ లాంచ్ అయ్యాక తెలుస్తుంది. శామ్‌సంగ్ కొత్త గెలాక్సీ A16 4Gని కొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త Galaxy A16 4G స్మార్ట్‌ఫోన్ తాజాగా మోడల్ నంబర్ SM-A165Fతో IMEI డేటాబేస్‌లో కనిపించింది.

- Advertisement -

Samsung Galaxy A15 4G Specifications

Samsung Galaxy A15 4G మొబైల్ 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ Mediatek Helio G99 చిప్‌సెట్‌లో పనిచేస్తుందని సమాచారం. అలాగే గరిష్టంగా 8GB RAM + 256GB వరకు స్టోరేజ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇక కెమెరా సెటప్ విషయానికొస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. అదే విధంగా ఫోన్ ముందు భాగంలో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

Also Read: ఇన్నాళ్లకు సరైన ఫోన్.. సామ్‌సంగ్ కొత్త మొబైల్.. కుర్చీని మడత పెట్టుడే!

Samsung Galaxy A15 4G పెద్ద 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత వన్ యుఐ 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 4 సంవత్సరాల పాటు సామ్‌సంగ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లకు కూడా హామీ ఇస్తుంది. ఇది కాకుండా ఇది 5 సంవత్సరాల పాటు సేఫ్టీ అప్డేట్‌లను పొందుతుంది. ఇది వినియోగదారులకు ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. Samsung Galaxy A16 4G గురించిన మరింత సమాచారం త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. కాగా Galaxy A15 సిరీస్ డిసెంబర్ 2023లో ప్రారంభించబడినందున Galaxy A16 సిరీస్ నవంబర్ లేదా డిసెంబర్ మధ్య లాంచ్ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News