Big Stories

Redmi Note 14 Pro: ఓ మై గాడ్.. రెడ్‌మీ కిరాక్ ఫోన్.. అతి తక్కువ ధరకే కోనేయండి..!

Redmi Note 14 Pro Launching Soon with Low Price: ప్రస్తుత కాలంలో స్మార్ట్‌పోన్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో అన్నీ టెక్ కంపెనీలు ఆఫర్డ్‌బుల్ ప్రైస్‌లో సరికొత్త ఫీచర్లను అందించే ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా 5జీ సర్వీసులు అందుబాటులోకి రావడంతో ఈ నెట్వర్క్ ఫోన్లను మొబైల్ లవర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ఒకప్పుడు స్మార్ట్‌‌ఫోన్‌ మార్కెట్‌ను ఓ ఊపు ఊపిన రెడ్‌మీ తాజాగా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే Redmi Note 13 Pro ఈ సిరీస్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్‌గా తీసుకొచ్చింది. ఇది రెడ్‌మీ లైనప్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.

- Advertisement -

రెడ్‌మీ నోట్ సిరీస్ ఫోన్లను తక్కువ ధరకే మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. దీనితో పాటుగా బెస్ట్ ఫీచర్లను ఆఫర్ చేస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా నోట్ 14 సిరీస్‌కు చెందిన కొత్త ఫోన్‌ను కంపెనీ విడుదల చేయనుందని వార్తలు వస్తున్నాయి. Weibo టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Redmi Note 14 Pro డిస్‌ప్లే కెమెరా సిస్టమ్ గురించి కొంత సమాచారాన్ని వెల్లడించింది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్‌లకు డౌన్‌గ్రేడ్ చేయబడుతుందని టిప్‌స్టర్ పేర్కొన్నారు. Redmi Note 14 Pro గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Redmi Note 14 Pro సెప్టెంబర్‌ 2024లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే IMEI డేటాబేస్‌లో గుర్తించబడింది. 9 మోడల్ నంబర్లలో 6 “2409”ని కలిగి ఉంది. ఈ నంబర్ ప్రకారం ఫోన్ సెప్టెంబర్ విడుదలవుతుందిని తెలుస్తుంది. ఈ సిరీస్ సెప్టెంబర్‌లో చైనాలో, నవంబర్‌లో ఇతర మార్కెట్‌లలోకి అందుబాటులోకి వస్తుంది.

Also Read: ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్ డీల్ బ్రో.. అస్సలు వదలొద్దు..!

టిప్‌స్టర్ ప్రకారం ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ కెమెరా కోసం సెంట్రల్ పంచ్ హోల్ కటౌట్‌తో 1.5K మైక్రో కర్వ్డ్ ప్యానెల్‌ను కలిగి ఉంటుంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ ఉంది. అయితే పెరిస్కోప్ టెలిఫోటో ఫీచర్ ఇందులో ఉండకపోవచ్చు. స్మార్ట్‌ఫోన్ సెంట్రల్ వర్టికల్ కెమెరా ఐలాండ్‌తో రావచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ Xiaomi రెడ్‌మీ నోట్ 14 Proగా లాంచ్ చేయవచ్చు.

Redmi Note 13 Pro Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లే, స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. దీని రిజల్యూషన్ 2712×1220 పిక్సెల్స్‌. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెకండ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా ఉన్నాయి. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

Also Read: మోటో నుంచి బడ్జెట్ ఫోన్.. తక్కువ ధరకే అదిరిపోయే ఫీచర్లు!

ఫోన్‌లో Snapdragon 7s Gen 2 చిప్‌సెట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇది 8GB RAM +12GB RAM ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 5100mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 67W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. అయితే, Redmi Note 13 Pro+ అనేది 120W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతునిచ్చే Redmi నుండి వచ్చిన మొదటి కర్వ్డ్ స్క్రీన్ స్మార్ట్‌ఫోన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News