Big Stories

Redmi Note 13 Pro 5G: మరొ కొత్త కలర్‌లో రెడ్‌మీ 13 ప్రొ ఫోన్.. అబ్బా ఏముంది బాసూ..!

Redmi Note 13 Pro 5G Smart Phone in new Olive Green Color: భారతదేశంలో గతంలో Redmi Note 13 Pro 5G, Redmi Note 13 5G, Redmi Note 13 Pro+ 5G స్మార్ట్‌ఫోన్‌లు ప్రారంభించబడ్డాయి. అయితే స్టార్టింగ్‌లో ప్రో వేరియంట్ మూడు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో ఈ ఫోన్ మరొక కొత్త కలర్ వేరియంట్‌లో పరిచయం చేయబడింది.

- Advertisement -

అయితే ఈ కొత్త కలర్ వేరియంట్‌ను భారతదేశంలో ప్రారంభించడాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. Redmi Note 13 Pro 5G ఫీచర్ల విషయానికొస్తే.. ఇది 1.5K AMOLED డిస్‌ప్లేతో 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది గరిష్టంగా 1,800 nits వరకు బ్రైట్‌నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm స్నాప్‌డ్రాగన్ 7s Gen 2 SoC ద్వారా ఆధారితం అయింది. ఇది గరిష్టంగా 12GB RAM + 256GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది.

- Advertisement -

Xiaomi ప్రకారం.. Redmi Note 13 Pro 5G సరికొత్త ఆలివ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ కలర్ ఎంపిక చేసిన ప్రపంచ మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఇది భారతదేశంలోకి ఎప్పుడు వస్తుందో ఇంకా వెల్లడికాలేదు. గ్లోబల్ మార్కెట్‌లో Redmi Note 13 Pro 5G అరోరా పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, ఓషన్ టీల్ షేడ్స్‌లో కూడా అందుబాటులో ఉంది. అదే సమయంలో భారతదేశంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్ కలర్‌లలో ప్రవేశపెట్టబడింది.

Also Read: బంగారం లాంటి ఆఫర్.. 200 MP కెమెరా ఫోన్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. ఇప్పుడు ఎలా చేయాలి!

ఇక Redmi Note 13 Pro 5G ధర విషయానికొస్తే.. ప్రస్తుతం దీని బేస్ 8GB + 128GB స్టోరేజ్ వేరియంట్ భారతదేశంలో రూ. 24,999 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దీని 8GB ర్యామ్+ 256GB స్టోరేజ్.. 12GB ర్యామ్+ 256GB స్టోరేజ్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.26,999, రూ. 28,999గా ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో ఈ స్మార్ట్‌ఫోన్‌ భారతదేశంలో లాంచ్ చేయబడింది.

Redmi Note 13 Pro Specifications

Redmi Note 13 Pro 5G స్మార్ట్‌ఫోన్ 2712 x 1220 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.67-అంగుళాల CrystalRes AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1800నిట్స్ గరిష్ట ప్రకాశం కలిగి ఉంది. ఈ ఫోన్ Snapdragon 7s Gen 2 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది 67W టర్బో ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 5,100mAh బ్యాటరీని కలిగి ఉంది. అలాగే కెమెరా సెటప్ విషయానికొస్తే.. Redmi Note 13 Pro 5Gలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. దీని ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News