Big Stories

Redmi 12 5G Crazy Offer: పొద్దు పొద్దునే 5జీ ఫోన్‌పై క్రేజీ ఆఫర్.. రూ.625లకే కొనేయొచ్చు.. పరుగులే పరుగులు..!

Crazy Offer on Redmi 12 5G: ప్రస్తుతం అంతా స్మార్ట్‌ఫోన్లదే హవా నడుస్తోంది. దేశ వ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ వ్యాప్తి చెందడంతో ప్రముఖ టెక్ కంపెనీలు కొత్త కొత్త ఫోన్లను 5జీ నెట్‌వర్క్‌తో మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నాయి. ఈ మేరకు అదిరిపోయే ఫీచర్లను ఫోన్లలో అందిస్తూ ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తున్నాయి. సేఫ్టీ పరంగా కానీ, మంచి అనుభూతిని అందించే పరంగా కానీ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అయితే 5జీ నెట్‌వర్క్ కాబట్టి వాటి ధరలు కూడా అధికంగానే ఉంటున్నాయి. దీంతో తక్కువ ధరలో మంచి ఫీచర్లు కలిగిన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కుందాం అనుకున్నా కొందరు కొనుక్కోలేకపోతున్నారు.

- Advertisement -

అలాంటి వారికి ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్ ఫార్మ్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థలు అదిరిపోయే ఆఫర్లను అందిస్తూ తక్కువ ధరలో ఫోన్లను సేల్ చేస్తున్నాయి. ఒక రకంగా ఇది బడ్జెట్ ప్రియులకు మంచి అవకాశంగానే చెప్పుకోవాలి. మరి ఎప్పట్నుంచో తక్కువ ధరలో కొత్త 5జీ ఫోన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నవారికి ఇప్పుడో గుడ్‌న్యూస్. ఎందుకంటే మీరు అనుకున్న ధరలోనే కొత్త 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌తో పాటు కూపన్ డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ వంటివి కూడా లభిస్తాయి. వీటితో మరింత తక్కువ ధరకే రెడ్ మి 12 5జీ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. Redmi 12 5G ఫోన్ అమెజాన్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి 4GB RAM + 128GB Storage, 6GB RAM + 128GB Storage, 8GB RAM + 256GB Storage వేరియంట్లలో లభిస్తున్నాయి.

Also Read: తుక్కు రేగ్గొట్టాడు.. 24జీబీ ర్యామ్, 6100mAh బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో కొత్త ఫోన్ లాంచ్!

ఇందులో మిడ్ రేంజ్ 6GB RAM + 128GB Storage వేరియంట్‌పై మంచి డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తుంది. దీని అసలు ధర రూ.17,999 ఉండగా.. ఇప్పుడు 31 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.12,499లకే అమెజాన్‌లో లిస్ట్ అయింది. అంతేకాకుండా దీనిపై భారీ కూపన్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ.1000 కూపన్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ ఫోన్ రూ.11,499లకే సొంతం అవుతుంది.

అలాగే నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉంది. ఇవి కాకుండా భారీ ఎక్క్ఛేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది. ఏకంగా ఈ 5జీ ఫోన్‌పై రూ.11,874 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. ఒకవేళ ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ మొత్తం వర్తిస్తే.. దీనిని కేవలం రూ.625లకే సొంతం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంత పెద్ద మొత్తంలో ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాతఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. ఒక రకంగా చూస్తే.. 5జీ ఫోన్‌ను తక్కువ ధరలో కొనుక్కోవాలని చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశమనే చెప్పాలి. పొద్దు పొద్దునే ఇలాంటి క్రేజీ ఆఫర్‌‌ను ఎవరూ ఊహించి ఉండరేమో.

Also Read: Flipkart Mobile Offers: పెద్ద ఆఫర్ వచ్చిపడింది.. 108 MP కెమెరా ఫోన్‌పై డిస్కౌంట్ల మేళా!

ఇక ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.79 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. అలాగే 90హెర్ట్స్ అడాప్టివ్ సింక్ రిఫ్రెస్ రేట్‌ను కలిగి ఉంది. ఇది ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అలాగే ఫోన్ ముందు భాగంలో 8మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. అలాగే 5000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. MIUI 14 with Android 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News